iDreamPost
android-app
ios-app

బాయ్ ఫ్రెండ్ తో న‌టి మాళ‌వికా రాజ్ ప‌రిణయం!

ప్రస్తుతం ఎక్కడ చూసినా పెళ్లిళ్ళ సీజన్ కొనసాగుతుంది. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా పెళ్లిళ్ళ సీజన్ కొనసాగుతుంది. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు.

బాయ్ ఫ్రెండ్ తో న‌టి మాళ‌వికా రాజ్ ప‌రిణయం!

ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ కావడంతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల ఇంట పెళ్లిభాజాలు మోగుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన పూజా గాంధీ తనకు నచ్చిన ప్రియుడిని పెళ్లి చేసుకుంది.. బాలీవుడ్ కి చెందిన నటుడు రణ్‌దీప్ హుడా ఓ ఇంటివాడు అయ్యాడు. తాజాగా నటి మాళవికా రాజ్ తన బాయ్ ఫ్రెండ్ ని వివాహం చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఈ మధ్య సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మద్యనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ-లావణ్య త్రిపాఠి వివాహబంధంతో ఒక్కటయ్యారు. దండుపాళ్యం నటి పూజా గాంధీ, బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా తన గర్ల్ ఫ్రెండ్ ని వివాహం చేసుకున్నాడు. తాజాగా యువ నటి మాళవిక రాజ్ తాను ప్రేమించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ప్రవీణ్ బగ్గా వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. గోవాలో జరిగిన ఈ వివాహ వేడుకకు సన్నిహితులు, బంధువుల, కొద్దిమంది సెలబ్రెటీలు విచ్చేసినట్లు సమాచారం. ఈ జంట క్యూట్ పిక్స్ వైరల్ గా మారాయి.

బాలీవుడ్ లో వచ్చిన మూవీ ‘కబీ ఖుషి కబీ ఘమ్’ మూవీలో హీరోయిన్ కరీనా కపూర్ కు చిన్ననాటి పాత్ర పోషించిన నటి మాళవికా రాజ్. గత వారం మాళవిక తన నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ.. భాగస్వామితో ఉన్న పిక్స్ ని అభిమానులతో పంచుకుంది. గోవాలో జరిగిన పెళ్లికి సంబంధించిన ఫోటోలను మాళ‌విక ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ సందర్భంగా మాళవిక తన హృదయాలు, ప్రేమ, కృతజ్ఞతలతో నిండిపోయిందని ఆమె రాసుకొచ్చింది. బాలీవుడ్ నటుడు జగదీశ్ రాజ్ మనవరాలు మాళవికా రాజ్. కెప్టెన్ నవాబ్, స్క్వాడ్.. తెలుగు లో జయదేవ్ చిత్రాల్లో నటించింది.

 

View this post on Instagram

 

A post shared by Malvika Raaj (@malvikaraaj)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి