iDreamPost

Hero Darshan: దర్శన్ అరెస్ట్ విషయంలో.. మనస్తాపంతో అభిమాని ఆత్మహత్య

  • Published Jun 18, 2024 | 9:04 AMUpdated Jun 18, 2024 | 9:04 AM

నటుడు దర్శన్ కేసు విషయంలో రోజు రోజుకు కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తుండగా.. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మరొక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.

నటుడు దర్శన్ కేసు విషయంలో రోజు రోజుకు కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తుండగా.. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మరొక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.

  • Published Jun 18, 2024 | 9:04 AMUpdated Jun 18, 2024 | 9:04 AM
Hero Darshan: దర్శన్ అరెస్ట్ విషయంలో.. మనస్తాపంతో అభిమాని ఆత్మహత్య

కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసు విషయం.. ఇండస్ట్రీలో తీవ్ర కల కలం రేపింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన పలువురిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని.. వారిని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇక ఈ కేసు విషయంలో పలువురు సినీ సెలెబ్రిటీలు కూడా తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. దానికి సంబంధించిన అప్ డేట్స్ కూడా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. ఇండస్ట్రీ అంత దర్శన్ కు తగిన శిక్ష పడాలని కోరుకుంటుంటే.. మరోవైపు నటుడు దర్శన్ అభిమానులు మాత్రం.. ఆయనను విడుదల చేయాలంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో అభిమాని ఏకంగా ఆత్మహత్య చేసుకున్న విషయం.. అందరిని కలవర పెడుతుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ఇండస్ట్రీ అంత దర్శన్ కు కఠిన శిక్ష పడాలని.. రేణుక స్వామి కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటుంటే.. కొందరు మాత్రం.. ఇవన్నీ పట్టించుకోకుండా.. దర్శన్ అరెస్ట్ పై ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దర్శన్ ను అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ ఎదుట అతనికి అనుకూలంగా నిరసన తెలుపుతున్నారు. దానితో పాటు దర్శన్ ను వెంటనే విడుదల చేయాలంటూ.. ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కాకుండా మరో అభిమాని .. దర్శన్ ను అరెస్ట్ చేశారనే మనస్తాపంతో.. ఏకంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటన చన్నపట్నంలో చోటు చేసుకుంది. దీనితో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

నటుడు దర్శన్ అరెస్ట్ కావడంతో.. అతని అభిమాని.. రామనగర జిల్లా చన్నపట్నంలోని మాలెదొడ్డికి చెందిన భైరేష్.. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడట. దానితో గత రెండు మూడు రోజులుగా ఆహార పానీయాలు కూడా ముట్టుకోలేదని సమాచారం. దీనితో అతను మృతిచెందడంతో.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారితీసింది. అతను ప్రమాదవ శాత్తు పడిపోయాడని కొందరు.. కల్వర్టులో పడి ప్రాణాలు కోల్పోయాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన నిజ నిజాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఇక మరోవైపు దర్శన్ కేసు విషయంలో ఇప్పటివరకు మొత్తం 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోజు రోజుకి ఈ కేసులో కొత్త విషయాలు బయట పడడంతో.. దర్శన్ కు బెయిల్ రావడం కూడా కష్టమే అని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి