iDreamPost

Hanmakonda: కేజీల కొద్దీ బంగారం, కోట్లలో ఆస్తులు పోగేసిన ఎమ్మార్వో

  • Published Mar 14, 2024 | 11:34 AMUpdated Mar 14, 2024 | 11:47 AM

ఇటీవల జరిగిన ఏసీబీ రైడ్స్ లో జమ్మికుంట తహసీల్దార్ మర్కల రజినీకి చెందిన ఇంటి స్థలాలు, ఇతరేత్రా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల జరిగిన ఏసీబీ రైడ్స్ లో జమ్మికుంట తహసీల్దార్ మర్కల రజినీకి చెందిన ఇంటి స్థలాలు, ఇతరేత్రా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 14, 2024 | 11:34 AMUpdated Mar 14, 2024 | 11:47 AM
Hanmakonda: కేజీల కొద్దీ బంగారం, కోట్లలో ఆస్తులు పోగేసిన ఎమ్మార్వో

జమ్మికుంట తహసీల్దార్ మర్కల రజిని వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ.. ఇటీవల ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దీనితో ఏసీబీ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు.. హనుమకొండ జిల్లాలో రైడ్స్ నిర్వహించారు అవినీతి నిరోధకశాఖ అధికారులు. ఈ దాడుల్లో.. రజినికి చెందిన అక్రమ ఆస్తుల చిట్టా బయటపడింది. ఏకంగా రూ.12 కోట్లు విలువ చేసే అక్రమ ఆస్తులు వెలుగుచూశాయని అధికారులు వెల్లడించారు. ఆమె ఇంటితో పాటు.. ఆమె గతంలో క్లోజ్ గా ఉన్న.. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

హనుమకొండలోని కేఎల్ ఎన్ రెడ్డి కాలనీలో, ధర్మసాగర్, మరో నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. తహసీల్దార్ రజినిపై వచ్చిన ఆరోపణల కారణంగానే ఈ సోదాలు నిర్వహించిన అధికారులు.. పక్కా ప్రణాళికతో ఎటువంటి అనుమానం రాకుండా.. ఆమె బంధువులు, సన్నిహితులు ఇళ్లను టార్గెట్ చేసుకుని తనిఖీలు చేశారు. ఈ రైడ్స్ అన్ని కూడా.. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగాయి. అలాగే ఆమె గతంలో క్లోజ్ గా ఉన్న .. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో రజినీకి హనుమకొండలో రెండు అంతస్థుల ఇల్లు, 21 ఇంటి స్థలాలు, 7 ఎకరాల భూమి, 2కార్లు , 2 ద్విచక్ర వాహనాలు, బ్యాంకులో రూ. 25 లక్షలు, లాకర్లో కిలోన్నర బంగారం , ఇంట్లో రూ.1.50 లక్షల నగదు లభించినట్లు అధికారులు వెల్లడించారు.

అయితే, మొత్తంగా ప్రభుత్వ విలువ ప్రకారం.. వాటి విలువ రూ.3.25 కోట్లు . ఇందులో దాదాపు రూ.3 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా వారు గుర్తించారు. పైగా మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.12 కోట్ల వరకు ఉండవచ్చని.. డీఎస్పీ రమణమూర్తి తెలియజేశారు. ప్రస్తుతం తహసీల్దార్ రజినిని తీసుకున్న కరీంనగర్ పోలీసులు.. ఆమెను ఏసీబీ కోర్టులో హాజరు పరిచి.. రీమండ్ కు తరలించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో రజినీతో పాటు.. ఏ అక్రమ ఆస్తుల విషయంలో ఇన్వాల్వ్ అయిన మిగిలిన వారిని కూడా.. అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఈ విషయంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి