iDreamPost
android-app
ios-app

AB De Villiers: షాకింగ్ విషయం బయటపెట్టిన డివిలియర్స్.. ఆ సమస్యతోనే రెండేళ్లు ఆడానంటూ..!

  • Author singhj Published - 08:17 AM, Fri - 8 December 23

కెరీర్ ఆఖరి రెండేళ్లు ఓ సమస్యతో బాధపడుతూనే క్రికెట్ ఆడానని అంటున్నాడు మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్.

కెరీర్ ఆఖరి రెండేళ్లు ఓ సమస్యతో బాధపడుతూనే క్రికెట్ ఆడానని అంటున్నాడు మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్.

  • Author singhj Published - 08:17 AM, Fri - 8 December 23
AB De Villiers: షాకింగ్ విషయం బయటపెట్టిన డివిలియర్స్.. ఆ సమస్యతోనే రెండేళ్లు ఆడానంటూ..!

క్రికెట్​లో ఎందరో లెజెండరీ బ్యాటర్స్ ఉన్నారు. గవాస్కర్ నుంచి సచిన్ వరకు.. టెండూల్కర్ నుంచి ప్రస్తుత విరాట్ కోహ్లీ జమానా వరకు చాలా మంది గ్రేట్ బ్యాట్స్​మెన్ తమ అద్భుతమైన స్కిల్స్​తో పరుగుల వర్షం కురిపిస్తూ ఆడియెన్స్​ను అలరిస్తున్నారు. అయితే జెంటిల్మన్ గేమ్​లో కొందరు డిఫరెంట్ బ్యాట్స్​మన్ ఉంటారు. వాళ్లు పిచ్ ఎలా ఉంది? అవతల బౌలింగ్ చేస్తోంది ఎవరు? టార్గెట్ ఎంత? బాల్ స్వింగ్, స్పిన్ అవుతోందా? అనేది పట్టించుకోరు. తమకు నచ్చిన శైలిలో ఆడుతూ ప్రేక్షకుల్ని ఫుల్​గా ఎంటర్​టైన్ చేస్తారు. వీళ్లు గ్రౌండ్​లో ఉన్నంత సేపు ఫీల్డింగ్​ టీమ్స్​ను గజగజలాడిస్తారు. అలాంటి కోవలోకి వచ్చే క్రికెటరే ఏబీ డివిలియర్స్. సౌతాఫ్రికాకు చెందిన ఈ లెజెండరీ కీపర్, బ్యాటర్​ను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

గ్రౌండ్​కు నలుమూలలా షాట్లు కొడుతూ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టేవాడు డివిలియర్స్. అందుకే అతడ్ని మిస్టర్ 360గా పిలిచేవారు. ఎక్కడ బాల్ వేసినా బౌండరీ లేకపోతే సిక్స్​గా మలిచేవాడతను. వినూత్నమైన షాట్లు ఆడుతూ కీపర్ తమ మీద నుంచి కూడా ఈజీగా భారీ షాట్లు బాదేవాడు. దీంతో ఏం చేయాలో తోచక బౌలర్లు తల మీద చేతులు పెట్టుకునేవారు. పించ్ హిట్టింగ్​తో సఫారీ టీమ్​కు సింగిల్ హ్యాండ్​తో ఎన్నో విక్టరీలు అందించాడు డివిలియర్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్​లు ఆడి తన క్రేజ్​ను మరింత రెట్లు పెంచుకున్నాడు.

కెరీర్​లో పీక్ స్టేజ్​లో ఉండగానే 2018లో ఇంటర్నేషనల్ క్రికెట్​కు గుడ్​బై చెప్పేశాడు డివిలియర్స్. అయితే 2021 వరకు డొమెస్టిక్ లీగ్స్​లో కంటిన్యూ అయ్యాడు. ముఖ్యంగా ఐపీఎల్​లో ఆర్సీబీకి ఆడుతూ వచ్చాడు. ఆ టీమ్ విజయాల్లో అతడి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. కోహ్లీతో కలసి చాలా సార్లు భారీ భాగస్వామ్యాలు నమోదు చేశాడు. ఇంతలా వరల్డ్ క్రికెట్​ మీద తనదైన ముద్ర వేసిన ఈ లెజెండరీ ప్లేయర్ రిటైర్మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల ‘విన్​డెన్​ క్రికెట్’ అనే మ్యాగజీన్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. రిటైర్మెంట్​కు ముందు కంటిచూపు సమస్యతో బాధపడ్డానని తెలిపాడు.

కెరీర్​ ఆఖరి రెండేళ్లు రెటినా లేని కంటితోనే (డిటాచ్ రెటీనా) క్రికెట్ ఆడానని డివిలియన్స్ అన్నాడు. ‘నా కొడుకు తన మోకాలితో పొరపాటున నా కుడి కన్ను మీద తన్నాడు. అప్పటి నుంచి నా కంటి చూపు మందగించింది. అయితే సర్జరీ తర్వాత నువ్వు క్రికెట్ ఎలా ఆడావని డాక్టర్లు అడిగారు. అయితే నా ఎడమ కన్ను క్లియర్​గా కనిపించడం వల్లే క్రికెట్ ఆడటం సాధ్యమైంది’ అని డివిలియర్స్ చెప్పాడు. ఇది తెలిసిన ఫ్యాన్స్ ఏబీడీని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఒంటికన్నుతోనే అంత బాగా ఆడటం నీకు మాత్రమే సాధ్యం బాస్ అని మెచ్చుకుంటున్నారు. ఇన్నాళ్లు ఈ విషయాన్ని చెప్పకుండా దాచావని.. అసలు అలా ఎలా ఆడావని మరికొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి.. ఒంటికన్నుతోనే రెండేళ్లు క్రికెట్ ఆడానంటూ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Shubman Gill: లండన్ వీధుల్లో శుబ్ మన్ గిల్.. పక్కనే బాలీవుడ్ బ్యూటీ!