iDreamPost

Shubman Gill: లండన్ వీధుల్లో శుబ్ మన్ గిల్.. పక్కనే బాలీవుడ్ బ్యూటీ!

  • Author Soma Sekhar Published - 07:07 PM, Thu - 7 December 23

శుబ్ మన్ గిల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. లండన్ వెళ్లిన గిల్ పక్కన ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీ కనిపించింది. మరి గిల్ పక్కనున్న ఆ హాట్ బ్యూటీ ఎవరు? ఆ వివరాలు..

శుబ్ మన్ గిల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. లండన్ వెళ్లిన గిల్ పక్కన ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీ కనిపించింది. మరి గిల్ పక్కనున్న ఆ హాట్ బ్యూటీ ఎవరు? ఆ వివరాలు..

  • Author Soma Sekhar Published - 07:07 PM, Thu - 7 December 23
Shubman Gill: లండన్ వీధుల్లో శుబ్ మన్ గిల్.. పక్కనే బాలీవుడ్ బ్యూటీ!

శుబ్ మన్ గిల్.. తక్కువ సమయంలోనే టీమిండియాలో స్టార్ బ్యాటర్ గా గుర్తింపు దక్కించుకోవడమే కాకుండా.. జట్టులో తన ప్లేస్ ను సుస్థిర పరచుకున్నాడు. ఇక ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచ కప్ 2023 తర్వాత కాస్త విశ్రాంతి తీసుకున్నాడు. ఈ మెగాటోర్నీ అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కు దూరంగా ఉన్నాడు. ఈ సమయాన్ని గిల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే లండన్ వెళ్లాడు గిల్. దీంట్లో విడ్డూరం, ప్రత్యేక ఏముందని మీరు అనుకోవచ్చు.. లండన్ వెళ్లిన గిల్ పక్కన ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీ కనిపించింది. ప్రస్తుతం వీరిద్దరి పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి గిల్ పక్కనున్న ఆ హాట్ బ్యూటీ ఎవరో? వారిద్దరు కలిసి కనిపించడానికి కారణం ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.

శుబ్ మన్ గిల్.. ఒక పక్క తన సూపర్ ఆటతో, మరోపక్క సారా టెండుల్కర్ తో డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలతో ఎప్పుడూ ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా మరోసారి అమ్మాయి కారణంగా వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి సారా టెండుల్కర్ కాదండోయ్.. బాలీవుడ్ హాట్ బ్యూటీ అవనీత్ కౌర్. అవును లండన్ వీధుల్లో బాలీవుడ్ హాట్ బ్యూటీ అవనీత్ కౌర్ తో కలిసి గిల్ కనిపించాడు. వీరిద్దరి పిక్స్ సోషల్ మీడియా షేక్ చేస్తున్నాయి. దీంతో వీళ్లు ఎందుకు కలుసుకున్నారు? డేటింగ్ లో ఉన్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. అసలు విషయం ఏంటంటే?

shubman gill with avneeth kaur

గిల్, అవనీత్ కౌర్ లు ఓ పాట షూటింగ్ కోసం లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. పంజాబీ ఆల్బమ్ సాంగ్ లో గిల్, అవనీత్ కౌర్ లు ఆడిపాడనున్నారని సమాచారం. వీరితో పాటు ప్రొడ్యూసర్ రాఘవ శర్మ, అన్షుల్ గార్గ్ లు కూడా ఉన్నారు. వీరంతా కలిసి దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా.. గిల్ కు యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. దీంతో అతడు ఈ పంజాబీ ఆల్బమ్ లో నటిస్తే.. అదికాస్త బంపర్ హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. వీరిద్దరి కలిసి చూడటంతో.. ఇప్పుడు ఈ బ్యూటీతో ప్రేమాయాణం మెుదలు పెట్టాడా? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలుకుని సర్లే అనుకుంటున్నారు. మరి గిల్ పంజాబీ ఆల్బమ్ లో నటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి