iDreamPost
android-app
ios-app

OTT New Release: OTT లోకి వచ్చేసిన అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మూవీ

  • Published May 31, 2024 | 10:36 AMUpdated May 31, 2024 | 10:36 AM

ఈ వీకెండ్ మంచి సినిమాలు ఎమున్నాయా అని సెర్చ్ చేసే పనిలో ఉన్నారు ఓటీటీ లవర్స్. వారి కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సినిమా రానే వచ్చేసింది. కాబట్టి ఈ సినిమా చూసి ఎంచక్కా ఎంజాయ్ చేసేయండి.

ఈ వీకెండ్ మంచి సినిమాలు ఎమున్నాయా అని సెర్చ్ చేసే పనిలో ఉన్నారు ఓటీటీ లవర్స్. వారి కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సినిమా రానే వచ్చేసింది. కాబట్టి ఈ సినిమా చూసి ఎంచక్కా ఎంజాయ్ చేసేయండి.

  • Published May 31, 2024 | 10:36 AMUpdated May 31, 2024 | 10:36 AM
OTT New Release:  OTT లోకి వచ్చేసిన అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మూవీ

ఓటీటీ లోకి ఈ వారం చూడదగిన సినిమాలు కేవలం కొన్ని మాత్రమే ఉన్నాయి. దీనితో ఈ వీకెండ్ ఎలా ఎంటర్టైన్ అవ్వాలా అని ఫీల్ అవుతున్నారు మూవీ లవర్స్. ఈ క్రమంలో ఈ వీకెండ్ అందరిని నవ్వించడానికి ఓ మంచి సినిమా వచ్చేసింది. కాబట్టి ఈ సినిమా చూసి ఎంచక్కా ఎంజాయ్ చేసేయండి. థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా త్వర త్వరగా ఓటీటీ లోకి వచ్చేస్తే.. ఈ సినిమా మాత్రం వాటితో పోల్చుకుంటే కాస్త ఆలస్యంగా వచ్చినట్లే. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. అదే అల్లరి నరేష్ నటించిన ఆ ఒక్కటి అడక్కు మూవీ. మరి ఈ మూవీ ఓటీటీ రెస్పాన్స్ ఎలా ఉందనే విషయం కూడా చూసేద్దాం.

అల్లరి నరేష్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడక్కు ఓటీటీ లోకి వచ్చేసింది. మే 31 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు.. ఇప్పుడు ఎంచక్కా ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేసేయండి. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అందరికి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఆ టైటిల్ మీద వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ గురించి అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి.. వింటేజ్ అల్లరి నరేష్ కామెడీ ని ఈ సినిమాలో ఊహించారు అంతా… కానీ ప్రేక్షకులు ఊహించినంత రేంజ్ లో కామెడీ పండకపోవడంతో.. ప్రేక్షకులు కాస్త నిరాశ చెందారు. కానీ ఇప్పుడు ఓటీటీ లో మాత్రం ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకునే బాటలో ఉంది.

ఈ మధ్య కాలంలో చాలా వరకు సినిమాలు థియేటర్ లో హిట్ కాకపోయినా కానీ.. ఓటీటీ లో మాత్రం మంచి వ్యూవర్ షిప్ ను దక్కించుకుని.. ట్రెండింగ్ లో కూడా నిలుస్తున్నాయి. ఈ సినిమా కూడా రానున్న రోజుల్లో ట్రెండింగ్ లో ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఈ సినిమా కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు యువత అంతా కూడా పెళ్లి సమస్యలతో పోరాటం చేస్తూనే ఉంటారు. ఈ సినిమాలో ఈ సమస్యలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. కానీ అప్పటికే ఆమె ఓ మ్యాట్రిమోనీ స్కాం లో చిక్కుకుంటుంది. దీనితో ఆమెను హీరో ఎలా సేవ్ చేశాడు అనేదే ఈ సినిమా కథ. దానితో పాటు పెళ్లి కానీ వారి సమస్యలు ఎలా ఉంటాయో కూడా ఈ సినిమాలో చూపించారు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి