iDreamPost

అర్ధాంగి చదువు కోసం విదేశాలకి భర్త! భార్య మాత్రం ఇక్కడ ప్రియుడితో!

ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు చాలా దారుణంగా ఉన్నారు. కట్టుకున్న భర్తను కాదని పరాయివాడి మోజులో పడిపోతున్నారు. పరాయి వాడి మోజులో పడి పచ్చని సంసారాన్ని కాల్చేసుకుంటున్నారు.

ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు చాలా దారుణంగా ఉన్నారు. కట్టుకున్న భర్తను కాదని పరాయివాడి మోజులో పడిపోతున్నారు. పరాయి వాడి మోజులో పడి పచ్చని సంసారాన్ని కాల్చేసుకుంటున్నారు.

అర్ధాంగి చదువు కోసం విదేశాలకి భర్త! భార్య మాత్రం ఇక్కడ ప్రియుడితో!

నేటికాలంలో కొందరు మహిళలు చాలా దారుణంగా ఉన్నారు. కట్టుకున్న భర్తను కాదని పరాయివాడి మోజులో పడిపోతున్నారు. దూరపు కొండలు నునుపు అనే విషయాన్ని మర్చి..పచ్చటి సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. కొందరు భార్యాలు..తన చదువు కోసం మద్దతుగా నిలబడిన భర్తను తీర చదువు పూర్తి చేశాక గట్టి షాకి ఇస్తుంది. తాజాగా  తన భార్య చదువు కోసం చేసిన అప్పులను తీర్చేందుకు విదేశాలకు వెళ్లిన ఓ భర్తకు ఊహించని షాక్ తగిలింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

తమిళనాడు రాష్ట్రంలోని తెన్సాసి జిల్లా కడయనల్లూరు సమీపంలోని త్రికూటపురానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి తిరుమలి కుమార్ అనే కుమారుడు ఉన్నాడు. అతడికి సెంగోట్టె ప్రాంతానికి చెందిన జ్యోతిమణి కుమార్తె సుమిత్ర అనే యువతితో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. తిరుమలి కుమార్, సుమిత్రలకు ఒక బిడ్డ జన్మించాడు. అప్పటికే 12వ తరగతి వరకు చదివిన సుమిత్ర ఇంకా చదవాలని భావించి.. అదే విషయాన్ని తన భర్తకు చెప్పింది. అతడు కూడా సుమిత్రను అప్పులు చేసి మరీ ఉన్నత చదువులు చదివించాడు. ఇక భార్య  చదువు కోసం చేసిన అప్పులు తీర్చేందుకు తిరుమలి కుమార్ విదేశాలకు వెళ్లాడు. అలా అప్పులు తీర్చేందుకు సుమిత్ర భర్త రెండేళ్ల క్రితం విదేశాలకు వెళ్లాడు.

తన కోసం కష్టపడుతున్న భర్త గురించి మర్చిపోయి.. సుమిత్ర తనలోని పాడు బుద్దిని పెంచుకుంది. అత్తమామలు, బిడ్డతో కలిసి ఉంటున్న సుమిత్ర సోషల్ మీడియాలో మునిగితేలేది. ఉదయం లేచినది మొదలు సాయంత్ర వరకు ఇన్ స్టాగ్రామ్ లో ఉండేది. ఈ క్రమంలోనే సుమిత్రకు మధురైకు చెందిన  ఓయువకుడు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. తనకు సంబంధించిన విషయాలను అతడితో  షేర్ చేసుకుంది. అంతేకాక భర్త లేని సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఆ యువకుడితో చాలా సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం.   ఈక్రమంలోనే రెండు రోజుల క్రితం పుట్టింకి వెళ్తున్నానని అత్తింటి వారికి చెప్పిన సుమిత్ర  యువకుడితో పారిపోయింది.  ఈ క్రమంలోనే తిరుమలి కుమార్ భార్య సుమిత్ర అతనికి వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ పంపింది. అందులో భార్య సుమిత్ర మరో అబ్బాయిని పెళ్లి చేసుకున్న దృశ్యాలను చూసి షాకయ్యాడు. వెంటనే తన భార్య ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అయింది.

ఆ తర్వాత అతడి అత్తగారి నుంచే నేరుగా కాల్ వచ్చింది. దయచేసి ఇకపై తన కుమార్తెను సంప్రదించవద్దని, తనకు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని చెప్పి.. ఆమె కూడ ఫోన్ స్విచ్చాఫ్ చేసింది. దీంతో ఏం చేయాలో తెలియక విదేశాల్లో ఉన్న భర్త తిరుమలికుమార్ తన కుటుంబ సభ్యుల చేత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని చెప్పాడు. భార్య చదువుకునేందుకు చేసిన అప్పు తీర్చేందుకు విదేశాలకు వెళ్లిన భర్త గురించి ఆలోచించకుండా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన యువకుడితో పెళ్లి చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. మరి.. ఇలాంటి వారికి ఎలాంటి మహిళలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి