iDreamPost

డెంగ్యూ బారిన పడి యువ డాక్టర్ మృతి

డెంగ్యూ బారిన పడి యువ డాక్టర్ మృతి

మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డెంగ్యూ, మలేరియా సోకి ఓ యువ డాక్టర్ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా విలపించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి అనే యువతి చాలా కాలంగా డాక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ యువతి గత రెండు మూడు రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడింది. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, వైద్యులు ఆ యువతికి అనేక పరీక్షలు నిర్వహించారు.

అయితే ఈ పరీక్షల్లో ఈ యువతికి డెంగ్యూ, మలేరియా సోకినట్లు నిర్దారణ అయింది. ఇక పరిస్థితి విషమించడంతో వైష్ణవి మంగళవారం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆ యువతి మరణంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగితేలారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో మృతురాలి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుమకున్నాయి. జ్వరం వచ్చిన సమయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని, వెంటనే దగ్గర్లోని వైద్యులను సంప్రదించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి