iDreamPost

పోలీసు కావాలనుకున్నాడు.. తండ్రిని చంపి హంతకుడయ్యాడు..

crime news: ఈరోజుల్లో మానవ సంబంధాలు మరింత దిగజారిపోతున్నాయి. తండ్రి అంటే పిల్లలకు, భార్య భర్తకు, భర్తంటే భార్యకు ఇలా ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు ఉండటం లేదు. అందుకే దారుణాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.

crime news: ఈరోజుల్లో మానవ సంబంధాలు మరింత దిగజారిపోతున్నాయి. తండ్రి అంటే పిల్లలకు, భార్య భర్తకు, భర్తంటే భార్యకు ఇలా ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు ఉండటం లేదు. అందుకే దారుణాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.

పోలీసు కావాలనుకున్నాడు.. తండ్రిని చంపి హంతకుడయ్యాడు..

సమాజంలో రాను రాను మానవ సంబంధాలు దారుణంగా దిగజారిపోతున్నాయి. బంధాలు, బంధుత్వాలకు అస్సలు విలువ లేకుండా పోతోంది. కోపంతోనో, బాధతోనో, ఆస్తుల కోసమో ఇలా కారణం ఏదైనా కన్న వారిని కూడా కడతేర్చడానికి వెనకాడటం లేదు. అలాంటి ఒక దారుణమైన ఘటన ఒకటి తెలంగాణలో వెలుగు చూసింది. ఒక కొడుకు కన్న తండ్రిని అత్యంత కిరాతకంగా విచక్షణారీతిన కొట్టడమే కాకుండా.. కొన ఊపిరితో ఉన్నాడు.. చచ్చాకే తలుపు తీస్తా అంటూ కర్కశంగా ప్రవర్తించాడు. అసలు ఏం జరిగింది? కన్న తండ్రిపై అంత దారుణానికి ఎందుకు ఒడి గట్టాడు? అనే పూర్తి వివరాలు..

ఈ దారుణం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం రామతీర్థంలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమానందం(42), సుగుణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొన్నాళ్లు సఖ్యతగా సాగిన కాపురంలో తరచూ గొడవలు జరగడం మొదలయ్యాయి. ప్రేమానందానికి తాగుడు అలవాటు ఉంది. తరచూ తాగి రావడమే కాకుండా.. భార్య సుగుణమ్మతో గొడవ పెట్టుకునేవాడు. అంతేకాకుండా ఆమె మీద అనుమానంతో గొడవకు దిగేవాడు. వీళ్ల పిల్లలు పెద్ద కొడుకు సందీప్ డిగ్రీ చదువుతున్నాడు. కూతురు 9వ తరగతి, చిన్న కుమారుడు 7వ తరగతి చదువుతున్నాడు. తండ్రి తాగుడు వ్యవహారంలో పిల్లలు కూడా తల్లికే మద్దతుగా ఉండేవాళ్లు. తండ్రికి నచ్చచెప్పందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది.

మరోవైపు 10 రోజుల క్రితమే ప్రేమానందానికి అల్లాదుర్గం పీఎస్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. అయినా అతని తీరు మార్పు రాలేదు. మళ్లీ భార్యతో గొడవ పెట్టుకున్నాడు. భార్యా, పెద్ద కొడుకు రోకలి బండతో ప్రేమానందం కాళ్లు విరగొట్టి నడవడానికి కూడా లేకుండా చేసేసి తల్లిగారింటికి వెళ్లిపోయారు. అలా వెళ్లాక శనివారం పెద్ద కొడుకు తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తండ్రి పక్కింటివారిని కూర్చోపెట్టి మాట్లాడుతూ కనిపించాడు. ఆ సమయంలో కోపంతో ఊగిపోయిన సందీప్.. తన తాతని పక్కింటి వారిని ఇంట్లో నుంచి బయటకు పంపేశాడు. ఆ తర్వాత తలుపులు మూసేసి కరెంట్ హీటర్ తీసుకుని విచక్షణారహితంగా కొట్టడం మొదలు పెట్టాడు. పక్కింటి వారు సందీప్ ని తలుపులు తీయాలంటూ కేకలు వేశారు. అయినా అతను వినలేదు. తండ్రి అని కూడా చూడకుండా కొడుతూనే ఉన్నాడు.

తలుపులు తీయమని కేకలు వేస్తే.. కొన ఊపిరితో ఉన్నాడు.. చచ్చాక తలుపులు తీస్తానంటూ దారుణంగా వ్యవహరించాడు. ఆ తర్వాత తండ్రి మెడకు చున్నీని బిగించి అతనికి ఉరి వేసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సందీప్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇటీవల సందీప్ పోలీసు ఉద్యోగానికి ప్రయత్నించి తృటిలో అవకాశం కోల్పోయాడని చెప్తున్నారు. క్షణికావేశంలో పోలీసు కావాలి అనుకున్నవాడు ఇప్పుడు తండ్రిని చంపి హంతకుడు అయ్యాడు. అలాగే ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా రోడ్డు మీద పడేశాడు. తండ్రి లేడు.. చేతికొచ్చిన కొడుకు జైలు పాలయ్యాడు. ఆ తల్లి ఇద్దరు పిల్లలను పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏదైనా సందీప్ చేసింది మాత్రం తప్పు అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తండ్రిని కడతేర్చిన కొడుకు చేసింది కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి