iDreamPost

US మహిళ బంపర్ ఆఫర్.. నాకు భర్తను వెతికితే రూ. 4 లక్షలు ఇస్తానంటూ ప్రకటన!

US మహిళ బంపర్ ఆఫర్.. నాకు భర్తను వెతికితే రూ. 4 లక్షలు ఇస్తానంటూ ప్రకటన!

ఓ US మహిళ బంపర్ ఆఫర్ ను ప్రజల ముందు ఉంచింది. నాకు భర్తను వెతికితే మీకు ఏకంగా రూ. 4 లక్షలు ఇస్తానంటూ ప్రకటించింది. దీనిని చూసి చాలా మంది ఓ రకంగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వార్త చదవిన అందరూ ఇంతకు ఈ మహిళ ఎవరు? ఆమె ఎక్కడ ఉంటుంది? అసలేం చేస్తుందనే పూర్తి వివరాలు తెలుసుకునేందుకు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని లాస్ ఎంజిల్స్ లో టిల్లీ కొల్సాన్ (35) అనే మహిళ నివాసం ఉంటుంది. అయితే, ఆమె టిక్ టాక్ వేదికగా తాజాగా ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. దాదాపుగా 5 ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్నానని, డేటింగ్ లో విసిగిపోయానని తెలిపింది.

ప్రస్తుతం నాకు ఓ తోడు కావాలని, దీని కోసం నా స్నేహితులకు ఆఫర్ ఇచ్చాను. కానీ, ఎవరూ ముందుకు రాలేదని తెలిపింది. ఇక వీటిన్నిటితో విసిగిపోయానని, మీరే నాకు ఓ మంచి వ్యక్తిని భర్తగా వెతికి పిడితే మీకు రూ.4 లక్షలు ఇస్తానని టిక్ టాక్ వేదికగా ఆమె ప్రకటించింది. మత, జాతి, విశ్వాసాలు అభిప్రాయాల గురించి నేనను పట్టించుకోనని కూడా తెలిపింది. అయితే, ఆమె పెట్టిన మరో కండిషన్ ఏంటంటే? నాకు కాబోయే భర్త 27 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలని, దీంతో పాటు 5.11 అడుగులు ఉండాలని కోరింది. ఇక మ్యారేజ్ సర్టిఫికేట్ పై సంతకం పెట్టిన మరుక్షణమే వెతికి పెట్టిన వారికి రూ. 4 లక్షలు ఇస్తానని ఆమె ప్రకటించడం. ఈ మహిళ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి