iDreamPost
android-app
ios-app

ఆస్ట్రేలియాలో ఆ ఉద్యోగానికి భారీ డిమాండ్! కోట్లలో సంపాదన! మీరు వెళ్లొచ్చు!

  • Published May 18, 2024 | 7:30 PMUpdated May 18, 2024 | 7:30 PM

తాజాగా ఓ ప్రాంతంలో కంపెనీ.. ఉద్యోగంలో ఎవరైన చేరితే రూ.6 కోట్లు ఇస్తామని కలలో కూడా ఊహించని ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇంతకి ఎక్కడంటే..

తాజాగా ఓ ప్రాంతంలో కంపెనీ.. ఉద్యోగంలో ఎవరైన చేరితే రూ.6 కోట్లు ఇస్తామని కలలో కూడా ఊహించని ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇంతకి ఎక్కడంటే..

  • Published May 18, 2024 | 7:30 PMUpdated May 18, 2024 | 7:30 PM
ఆస్ట్రేలియాలో ఆ ఉద్యోగానికి భారీ డిమాండ్!  కోట్లలో సంపాదన! మీరు వెళ్లొచ్చు!

ప్రస్తుత కాలంలో ఎంత కష్టపడి ‍ప్రయత్నించిన ఉద్యోగం దొరకడం అనేది చాలా కష్టంగా మారింది. ఒక వేళ దొరికిన ఎక్కువ జీతాలు ఇచ్చే జాబులు దొరకడమంటే.. అదృష్టం కూడా కలిసి రావలని చెప్పవచ్చు. కానీ, తాజాగా ఓ ప్రాంతంలోని కంపెనీ మాత్రం.. ఉద్యోగంలో ఎవరైన చేరితే రూ.6 కోట్లు ఇస్తామని కలలో కూడా ఊహించని ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇంతకి ఎక్కడంటే..

తాజాగా పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఒక ఆ ప్రాంతం ఉద్యోగులు కలలో కూడా ఊహించని ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలో కారాడింగ్‌ అనే ఒక టౌన్ ఉంది. అయితే అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్  జాబ్లో చేరితే ఒక్కొక్కళ్ళకి ఆరు కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇక శాలరీ చాలా టెంప్టింగ్ గా అనిపిస్తున్నా.. అక్కడ జాబ్‌ లో మాత్రం ఎవరు చేరడం లేదు. ఎందుకంటే.. అక్కడికి ఎవరూ వెళ్లడం లేదు. ఎందుకంటే.. ఆ జాబ్‌ ఏమిటంటే ల ప్రాణాలను కాపాడే డాక్టర్‌ ఉద్యోగం. ఇక ఈ పట్టణంలో ఎవరూ పెద్దగా చదువుకోరు. పైగా అందరూ ఇక్కడ వ్యవసాయ పనుల పైనే ఆధారపడతారు. ఇక అక్కడ ఎవరికైనా అనారోగ్యం తలెత్తితే ఈ జాబ్ లో చేరే డాక్టర్ వైద్యం చేయాల్సి ఉంటుంది.

కాగా, గతంలో ఇక్కడ ఒక డాక్టర్ పని చేసేవారు. అయితే ఆయన కాంట్రాక్టు ముగియడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక మళ్ళీ రమ్మన్నా రావడం లేదు. దానికి ఏకైక కారణం ఏమిటంటే.. ఈ పట్టణం అనేది ప్రపంచానికి చాలా దూరంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా కావాలంటే.. చాలా దూరం ప్రయాణించి తెచ్చుకోవాల్సి ఉంటుంది. పైగా మిగతా ప్రపంచంతో కనెక్షన్లు కట్ అయిపోయినట్లే ఇక్కడి నివాసులకు అన్పిస్తుంది. అయితే ఎంతైనా అన్ని పట్టణాలలో లాగానే ఇక్కడ ఒక డాక్టర్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే పట్టణ పరిపాలనా అధికారులు డాక్టర్ కావాలంటూ ఒక ఉద్యోగ ప్రకటనను గత ఏడాది ప్రకటించారు. కానీ, ఇప్పటికీ ఎవరూ వరకు ఎవరూ చేరలేదట.

ఇకపోతే ఈ ఉద్యోగ ప్రకటన ప్రకారం.. డాక్టర్ జాబులో జాయిన్ అయ్యేవారు ఎలాంటి ఇంటర్వ్యూ క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. మంచి పేరు, అనుభవం ఉంటే సరిపోతుంది. అయితే జాయిన్ అయిన వారికి ఉచితంగా ఇల్లు కూడా అందజేస్తారు. అలాగే కనీస సౌకర్యాలను సైతం కల్పిస్తారు. అలాగే నెలకు ఒక మిలియన్ డాలర్లను జీతం గా అందజేస్తారు. ఇన్ని ఆఫర్లు అందిస్తున్నా ఇప్పటికీ ఒక్క డాక్టర్ కూడా అక్కడికి వెళ్లి జాయిన్ కాకపోవడం గమనార్హం.  ఇక ఈ ఉద్యోగ ప్రకటన గురించి తెలుసుకున్న చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మరి, పశ్చిమ ఆస్ట్రేలియాలో ఇంత భారీ జీతాన్ని ప్రకటించిన ఈ డాక్టర్‌ ఉద్యోగం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి