iDreamPost
android-app
ios-app

రెడ్ లిప్ స్టిక్ పై నిషేధం.. ఉల్లంఘించి వేసుకుంటే మాత్రం కఠినంగా..

Imposed A Ban On Red Colour Lipstick: యువతులకు భారీ షాకిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. రెడ్ కలర్ లిప్ స్టిక్ ని వాడకూడదు. నిబంధనలు ఉల్లంఘించి వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Imposed A Ban On Red Colour Lipstick: యువతులకు భారీ షాకిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. రెడ్ కలర్ లిప్ స్టిక్ ని వాడకూడదు. నిబంధనలు ఉల్లంఘించి వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రెడ్ లిప్ స్టిక్ పై నిషేధం.. ఉల్లంఘించి వేసుకుంటే మాత్రం కఠినంగా..

లిప్ స్టిక్ అంటే ఇష్టం ఉండని స్త్రీలు, అమ్మాయిలు, యువతులు చాలా అరుదుగా ఉంటారు. మేకప్ ఉన్నా లేకపోయినా లిప్ స్టిక్ మాత్రం ధరిస్తూ ఉంటారు. లిప్ స్టిక్ వేసుకోవద్దు అని ఇంట్లో వాళ్లు చెప్పినా కూడా అస్సలు ఒప్పుకోరు. కానీ, అక్కడ ఉండే ఆడవాళ్లు మాత్రం లిప్ స్టిక్ ధరించకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. కాదని రెడ్ కలర్ లిప్ స్టిక్ ధరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అసలు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఇలాంటి నిర్ణయం ఎక్కడ తీసుకున్నారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఎందుకు నిషేధం?:

ఈ వార్త వినగానే ఎంతో మంది యువతుల గుండెల్లో రాయి పడ్డట్లు అవుతుంది. ఎందుకంటే లిప్ స్టిక్ లో రెడ్ కలర్ అనేది వాళ్ల ఫేవరెట్. అయితే ఈ వార్త చూసి ఇండియాలో ఉండే యువతులు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఈ నిషేధం విధించింది ఇండియాలో కాదు. ఉత్తర కొరియాలో రెడ్ కలర్ లిప్ స్టిక్ మీద నిషేధం విధించారు. దీనికి తగిన విధంగా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిర్ణయం తీసుకున్నారు. రెడ్ కలర్ లిప్ స్టిక్ ను నార్త్ కొరియా దేశం పెట్టుబడిదారీ విధానానికి సంకేతంగా భావిస్తుందంట. ఆ విధానం కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేకమని చెప్తున్నారు. అందుకే ఇలా రెడ్ కలర్ లిప్ స్టిక్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అక్కడ మేకప్ నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. మేకప్ వేసుకోవడం అంతా పాశ్చాత్య దేశాల ట్రెడిషన్ గా భావిస్తారు. అందుకే మేకప్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రెడ్ కలర్ లిప్ స్టిక్ మీద కూడా నిషేధం విధించారు. ఇలాంటివి అన్నింటిని అనుమతిస్తూ పోతే దేశ ప్రజలు అంతా విదేశీ భావజాలానికి అట్రాక్ట్ అవుతారని ఉత్తర కొరియా అధినాయకత్వం భయపడుతున్నట్లు తెలుస్తోంది. దేశ పౌరులు అందరూ ఎంతో సింపుల్ గా, న్యాచురల్ గా ఉండాలి అని ఎప్పటి నుంచో కిమ్ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది.

లిప్ స్టిక్ మాత్రమే కాదు..:

మేకప్, రెడ్ కలర్ లిప్ స్టిక్ మాత్రమే కాదు.. ఇంకా చాలానే నిషేధాలు ఉన్నాయి. పలు రకాల ఫ్యాషన్ బ్రాండ్లపై ఉత్తర కొరియా ఇప్పటికే నిషేధం ఉంది. స్కిన్ టైట్ బ్లూ కలర్ జీన్స్ వేసుకోవడం నార్త్ కొరియాలో బ్యాన్ చేశారు. ఒకవేళ అలాంటి జీన్స్ ప్యాంట్స్ వేసుకుని రోడ్ల మీద కనిపిస్తే.. మల్లీ ఆ జీన్స్ తిరిగి ధరించేందుకు వీలు లేకుండా కత్తిరించేస్తారు. అంతేకాకుండా కొన్ని రకాల ఆభరణాలు, కొన్ని రకాల హెయిర్ స్టైల్స్ మీద ఉత్తర కొరియాలో నిషేధం ఉంది. మహిళలు మాత్రమే కాదు.. పురుషులు కూడా ప్రభుత్వం అనుమతించిన పద్ధతుల్లోనే జుట్టును కత్తిరించుకోవాల్సి ఉంటుంది. కాదని ఇష్టారీతిన హెయిర్ కట్ చేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటారు.

ఉత్తర కొరియాలో ఇంకో వింత నిషేధం కూడా ఉంది. అదేంటంటే.. నలుపు రంగు ట్రెంచ్ కోట్ ను ఎవరూ ధరించకూడదు. ఎందుకంటే అది కిమ్ జోంగ్ ఉన్ ని అనుసరించే విధంగా ఉంటుందని. అలా ఎవరూ చేయకూడదు అని కిమ్ అలాంటి నిషేధాన్ని విధించినట్లు తెలుస్తోంది. ఇలా ప్రభుత్వం తీసుకొచ్చిన నిషేధాలను ఎవరైనా ఉల్లంఘిస్తే.. కఠినమైన శిక్షలు విధిస్తారు. అంతేకాకుండా భారీగా జరిమానాలు కూడా కట్టాల్సి ఉంటుంది. మరి.. ఉత్తర కొరియాలో రెడ్ కలర్ లిప్ స్టిక్ పై నిషేధం విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి