iDreamPost

ఆలయంలో దొంగతనానికి వెళ్లిన దొంగ! సాక్ష్యాత్తు ఆ దేవుడే పట్టించాడు!

  • Published Apr 04, 2024 | 12:13 PMUpdated Apr 04, 2024 | 12:31 PM

సాధారణంగా చాలామంది దొంగలు ఆలయాల్లో దేవుని ఆభరణలు, హుండీల్లో నగదును దోచుకొని ఎవ్వరికి దొరకకుండా తప్పించుకొని తిరుగుతుంటారు. అయితే.. అచ్చం అలానే ఓ దొంగ కూడా దేవాలయంలో ఉన్న హుండీ సొమ్మును కాజేయాలని అనుకున్నాడు. కానీ, అలా సాధ్యపడలేదు కాదు, కాదా.. తిరిగి బొక్కబొర్లా పడ్డి నరకయాతన పడ్డాడు. అసలేం జరిగిందంటే..

సాధారణంగా చాలామంది దొంగలు ఆలయాల్లో దేవుని ఆభరణలు, హుండీల్లో నగదును దోచుకొని ఎవ్వరికి దొరకకుండా తప్పించుకొని తిరుగుతుంటారు. అయితే.. అచ్చం అలానే ఓ దొంగ కూడా దేవాలయంలో ఉన్న హుండీ సొమ్మును కాజేయాలని అనుకున్నాడు. కానీ, అలా సాధ్యపడలేదు కాదు, కాదా.. తిరిగి బొక్కబొర్లా పడ్డి నరకయాతన పడ్డాడు. అసలేం జరిగిందంటే..

  • Published Apr 04, 2024 | 12:13 PMUpdated Apr 04, 2024 | 12:31 PM
ఆలయంలో దొంగతనానికి వెళ్లిన దొంగ! సాక్ష్యాత్తు  ఆ దేవుడే పట్టించాడు!

చాలామంది పొట్టకూటి కోసం, జీవన ఆధారం లేక ఏదో ఒక రకంగా కడుపు నింపుకోవాలని దొంగతనాలకు పాల్పడుతుంటారు.అయితే ఇలా ఈజీగా దోచుకున్న సొమ్ముతో కడుపు నింపుకొని జీవనం సాగిస్తుంటారు. అయితే ఇలా కష్టపడకుండా.. ఈజీగా డబ్బులు సంపాదించడమే చాలా సులువు అనుకునే వారు ఈ దొంగతననే వృత్తిగా మాల్చుకుంటారు. ఈ క్రమంలోనే.. ఇళ్లలోని, బస్ స్టెండ్ లోని, రైల్వే స్టేషన్స్ లో, అలాగే దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతుంటారు. కాగా, అలా చోరీ చేసిన వారు ఎవ్వరికి దొరకకుండా తప్పించుకొని తిరిగుతుంటారు. కానీ, తాజాగా ఓ దొంగ ఆలయంలో ఉన్న హుండీలో నగదును చోరీ చేయాలని అనుకున్నాడు. కానీ, నగదు చోరీ చేయడానికి సాధ్యపడక పోవడమే కాకుండా.. ఊహించని విధంగా ఆ ఆలయంలో ఆ దొంగ ఇరుక్కోని నరకయాతన చూశాడు. ఇంతకి ఏం జరిగిదంటే..

సాధారణంగా చాలామంది దొంగలు ఆలయాల్లో దేవుని ఆభరణలు, హుండీల్లో నగదును దోచుకొని ఎవ్వరికి దొరకకుండా తప్పించుకొని తిరుగుతుంటారు. అయితే.. అచ్చం అలానే ఓ దొంగ కూడా దేవాలయంలో ఉన్న హుండీ సొమ్మును కాజేయాలని అనుకున్నాడు. కానీ, ఆ దొంగతనం సాధ్యపడలేదు కాదు, కాదా.. తిరిగి బొక్కబొర్లా పడ్డాడు. అసలేం జరిగిందంటే.. ఆలయంలో ఉన్న దేవుడి హుండీలో సొమ్ము కాజేసే క్రమంలో ఓ దొంగ చెయ్యి అందులో ఇరుక్కుపోయింది. దీంతో అతడు తన చెయ్యిని బయటకి తీయాలని ఎంత ప్రయాత్నించిన సాధ్యపడలేదు. ఇక హుండీలో చెయ్యి ఇరుక్కుపోవడంతో.. సుమారు 12గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామ శివారులో గల మాసుపల్లి పోచమ్మ ఆలయంలో చోటుచేసుకుంది. అయితే ఆలయంలో పనిచేసే సురేష్ అనే వ్యక్తి ఈ దొంగతానానికి పాల్పపడ్డాడు.

కాగా, నిందుతుడు సురేశ్ రాత్రి 10 గంటల ప్రాంతంలో హుండీ పైభాగాన్ని ధ్వంసం చేశాడు. ఈ క్రమంలోనే అందులో డబ్బు తీసేందుకు హుండీ లోపల చేయ్యి పెట్టాడు. అయితే సురేష్ చేయ్యి హుండీలోనే ఇరుక్కుపోయింది.దీంతో సుమారు 12 గంటల పాటు సురేష్ నరకయాతన అనుభవించాడు. ఇక ఉదయం దేవాలయానికి వచ్చిన భక్తులు ఈ దృశ్యన్ని గమనించి..గ్రామస్తులకు సమాచారం అందించారు.అయితే గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సమక్షంలోనే.. గ్యాస్ కట్టర్‎తో సురేష్ చేతిని హుండీలోంచి తొలగించారు. అనంతరం దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని స్థానిక భిక్కనూర్ పోలీసులకు అప్పగించారు. మరి, దొంగతనానికి వచ్చిన వ్యక్తి చెయ్యి హుండీలో ఇరుక్కుపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి