iDreamPost

వీడియో: ఆడుకుంటున్న బాలుడిపై తీవ్రంగా దాడి చేసిన వీధి కుక్క

ఈ మధ్యకాలంలో వీధి కుక్కలు మనుషులపై పగబట్టినట్లు తీవ్రంగా దాడి చేస్తున్నాయి. తాజాగా ఓ బాలుడిపై సైతం అటెక్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది.

ఈ మధ్యకాలంలో వీధి కుక్కలు మనుషులపై పగబట్టినట్లు తీవ్రంగా దాడి చేస్తున్నాయి. తాజాగా ఓ బాలుడిపై సైతం అటెక్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారుతోంది.

వీడియో: ఆడుకుంటున్న బాలుడిపై తీవ్రంగా దాడి చేసిన వీధి కుక్క

గత కొంత కాలం నుంచి దేశ వ్యాప్తంగా వీధి కుక్కలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాయి. ఇటు నుంచి చిన్న పిల్లల నుంచి అటు వృద్ధుల వరకు ఎవరినీ వదలకుండా వారిపై దారుణంగా దాడి చేస్తున్నాయి. ఈ వీధి కుక్కల దాడి ఘటనలో ఇప్పటికీ ఎంతో మంది చిన్నారులు చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డారు వారు కూడా అనేకం. గతంలో హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో ఐదేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన కాలనీ వాసులు అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఎన్నిసార్లు మొర పెట్టుకున్న ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇకనైన స్పందించాలని కోరారు. ఆ దిశగా చర్యలు కూడా తీసుకోవాలని తెలిపారు. అయితే ఈ ఘటన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. ఇకపోతే, అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా మరో చోట వెలుగు చూసింది. ఇంటి ముంగిట ఆడుకుంటున్న ఓ 18 నెలల చిన్నారిపై వీధి కుక్క దారుణంగా కరిచింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ అహ్మదాబాద్ లోని జుహాపురాలోని ఓ ప్రాంతంలో ఓ 18 నెలల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్నాడు.

ఈ క్రమంలోనే రోడ్డుపై పై నుంచి పరుగెత్తుకొచ్చిన ఓ వీధి కుక్క ఈ బాలుడిపై తీవ్రంగా దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన ఆ బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆ కుక్క దాడి నుంచి ఆ పిల్లాడిని రక్షించారు. ఈ కుక్క దాడిలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో వెంటనే స్పందించడంతో పిల్లాడి ప్రాణపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఈ కుక్క దాడిలో ఆ బాలుడి ముఖం, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రస్తుతం ఆ బాలుడు ఆస్పత్రికిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అధికారులు స్పందించి వీధి కుక్కల నుంచి ప్రజల ప్రాణాలను రక్షించాలని కోరారు. అయితే ఆ బాలుడిపై వీధి కుక్క దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఒక్కోరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. 18 నెలల పిల్లాడిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి