iDreamPost

రెండేళ్లుగా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుని.. చివరకు

వివాహ తంతులో వింత పోకడలు వచ్చి చేరాయి. అలాగే వినూత్న పెళ్లిళ్లు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా పెళ్లి అనగానే ఆయా సంస్కృతులు, పద్ధతుల ప్రకారం పెళ్లి తంతు జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వివాహం కాస్త భిన్నం.

వివాహ తంతులో వింత పోకడలు వచ్చి చేరాయి. అలాగే వినూత్న పెళ్లిళ్లు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా పెళ్లి అనగానే ఆయా సంస్కృతులు, పద్ధతుల ప్రకారం పెళ్లి తంతు జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వివాహం కాస్త భిన్నం.

రెండేళ్లుగా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుని.. చివరకు

ఇటీవల కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయి, అబ్బాయి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పిస్తుంటారు. కాదంటే.. పెద్దలను ఎదిరించి.. రిజిస్టర్ మ్యారేజ్ లేదా ఆలయంలో మూడు ముళ్లు వేయడం, లేదా స్నేహితుల కలిసి వివాహ తంతు ముగించడం చేస్తుంటారు. అయితే ఏ వివాహ తంతులో అయినా వరుడు,వధువు ఉంటారు.కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ప్రేమ, పెళ్లి కథ డిఫరెంట్. ఈ పెళ్లిలో ప్రియుడు కమ్ వరుడు లేడు. కేవలం వధువులు మాత్రమే ఉన్నారు. వధువులు ఏంటీ అనుకుంటున్నారా.. అదేనండి ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఇద్దరు అమ్మాయిలు.. రెండు సంవత్సరాలు సహజీనవం చేసి..ఇటీవల పెళ్లితో ఒకటయ్యారు. ఇలాంటి వివాహాలను కేంద్రం నో అంటోన్న.. వీరి పెళ్లికి అధికారుల నుండి సమ్మతి లభించడం విశేషం. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ 24 పరగణాస్ కు చెందిన జయశ్రీ రౌల్, రాఖీ దాస్.. లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి నడుపుతున్న ఆర్కెస్ట్రాలో పనిచేసేవారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం, స్నేహంగా మారింది. ఆ తర్వాత అనుకోకుండా వీరి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్ల పాటు భార్యా భరల్లా ఒకే ఇంట్లో సహజీవనం చేశారు. సోమవారం మఝౌలి రాజ్‌లోని భగడ భవానీ ఆలయంలో వివాహం చేసుకున్నారు.

love between two girls

జయశ్రీ మాట్లాడుతూ.. తాము చాలా కాలంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని, అయితే కాస్త వెనకుడుగు వేసినట్లు చెప్పారు. ఎలాంటి సమస్యలు రాకూడదన్న ఉద్దేశంతో తమ పెళ్లికి పర్మిషన్ తెచ్చుకోవాలని యోచించాం. తాము భట్ పరాని తహశీల్ నుండి నోటరీ సర్టిఫికేట్ కూడా పొందాం. కొద్ది రోజుల క్రితం దిర్గేశ్వరనాథ్ ఆలయానికి వెళితే.. డీఎం అనుమతి తర్వాతే ఇక్కడ వివాహం చేసుకోవాలని అక్కడి పూజారీ చెప్పడంతో.. బాధపడ్డామని, ఎట్టకేలకు భవానీ ఆలయంలో ఏడడుగులు వేసినట్లు తెలిపింది. జీవితాంతం తోడు నీడగా ఉంటామని బాసలు చేసుకున్నారు ఈ జంట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. గతంలో కూడా బెంగాలికీ చెందిన మౌసమీ దత్తా, మౌమితా మజుందర్ అమ్మాయిలు కూడా వివాహం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా పెళ్లిళ్లు జరగడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి