iDreamPost

రైతు బిడ్డకు ఆల్ ఇండియా నంబర్ 1 ర్యాంకు.. JEE ఫలితాల్లో అద్భుతం

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఫలితాల్లో రైతు బిడ్డ అద్భుతం చేశాడు. ఆల్ ఇండియా నంబర్ 1 ర్యాంకు సాధించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. జేఈఈ ఫలితాల్లో ఆల్ ఇండియా నంబర్ 1 ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఫలితాల్లో రైతు బిడ్డ అద్భుతం చేశాడు. ఆల్ ఇండియా నంబర్ 1 ర్యాంకు సాధించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. జేఈఈ ఫలితాల్లో ఆల్ ఇండియా నంబర్ 1 ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

రైతు బిడ్డకు ఆల్ ఇండియా నంబర్ 1 ర్యాంకు..  JEE ఫలితాల్లో అద్భుతం

కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. కష్టపడితే ఫలితం తప్పక వరిస్తుంది. కావాల్సిందల్లా చేసే పనిపట్ల శ్రద్ధ, అంకితభావం. జీవితంలో ఓ లక్ష్యాన్ని ఏర్పర్చుకుని సరైన ప్రణాళికతో ముందుకుసాగితే దేన్నైనా సాధించొచ్చు. ప్రస్తుత కాలంలో నేటి యువత ఇదే నిరూపిస్తున్నారు. పరీక్షా ఫలితాల్లో, పోటీ పరీక్షల్లో అసాధారణ ప్రతిభ కనబర్చి సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. చదువు పూర్తికాక ముందే క్యాంపస్ ప్లేస్ మెంట్ లలో లక్షల ప్యాకేజీతో జాబ్స్ కు ఎంపికై అదరగొడుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాల సందడి కొనసాగుతోంది. పలువురు విద్యార్ధులు ఆల్ టైమ్ రికార్డు మార్కులతో హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ రైతు కుమారుడు అద్భుతం చేశాడు. జేఈఈ ఫలితాల్లో ఆల్ ఇండియా నంబర్ 1 ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వ‌హించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను గురువారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఓ రైతు బిడ్డ తన తండ్రి పడే కష్టానికి తగిన ఫలితాన్ని అందించాడు. తల్లిదండ్రులు కన్న కలలను తీర్చేందుకు అహర్నిషలు కష్టపడి చదివి జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ సాధించాడు. అతుడు మరెవరో కాదు మ‌హారాష్ట్ర‌లోని వాసిమ్ జిల్లాకు చెందిన నీల‌కృష్ణ గ‌జారే. తండ్రేమో రైతు. వ్యవసాయంపైనే ఆధారపడి కుటుంబం జీవిస్తోంది. తండ్రి పడే కష్టాలను చూసి వారి బాధలను తొలగించేందుకు ఎలాగైనా తాను ప్రయోజకుడిని కావాలని నీల‌కృష్ణ గ‌జారే నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే జేఈఈ కోసం సన్నద్ధమయ్యాడు. రెండేళ్ల నుంచి నీల‌కృష్ణ గ‌జారే ప‌ట్టుద‌లతో, ఆత్మ‌విశ్వాసంతో ప‌రీక్ష‌లకు ప్రిపేర‌య్యాడు.

ప్ర‌తి రోజూ ప‌ది గంట‌ల పాటు చ‌దువుకే అంకిత‌మ‌య్యేవాడు. లక్ష్యాన్ని అలక్ష్యం చేయకుండా క‌ఠిన‌మైన షెడ్యూల్‌తో ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌య్యాడు నీల‌కృష్ణ గ‌జారే. ఈ క్రమంలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాసిన నీల‌కృష్ణ గ‌జారే ఈ ఫలితాల్లో ఆల్ ఇండియా నంబర్ 1 ర్యాంకు సాధించి రైతు బిడ్డ సత్తాచాటాడు. త‌న కుమారుడు సాధించిన విజయం ప‌ట్ల మాట‌లు రావ‌డం లేద‌ని నీల‌కృష్ణ తండ్రి నిర్మ‌ల్ గ‌జారే చెప్పారు. త‌న కుమారుడు హార్డ్ వ‌ర్క్ చేస్తాడ‌ని, తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కే నిద్ర‌లేస్తాడని తెలిపాడు. చదువుల్లోనే కాదు తన కొడుకు ఆర్చ‌రీలో రాష్ట్ర‌, జాతీయ జ‌ట్టుకు ఎంపికైన‌ట్లు తండ్రి చెప్పాడు. ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ సాధించిన నీల‌కృష్ణ గ‌జారేపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి