iDreamPost

కొడుకు పుట్టినరోజుని ఈ తండ్రి సెలబ్రేట్ చేసిన తీరుకి హేట్సాఫ్ చెప్పొచ్చు!

  • Published Apr 15, 2024 | 11:30 PMUpdated Apr 15, 2024 | 11:30 PM

సాధారణంగా ప్రతిఒక్కరి ఇంట్లో తమ పిల్లల పుట్టిన రోజు వస్తే ఏ రకంగా హంగామా చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఓ వ్యక్తి మాత్రం తన కొడుకు పుట్టిన రోజు నాడు ఓ కొత్త ట్రెండ్ ను సెట్ చేసేలా చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

సాధారణంగా ప్రతిఒక్కరి ఇంట్లో తమ పిల్లల పుట్టిన రోజు వస్తే ఏ రకంగా హంగామా చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఓ వ్యక్తి మాత్రం తన కొడుకు పుట్టిన రోజు నాడు ఓ కొత్త ట్రెండ్ ను సెట్ చేసేలా చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

  • Published Apr 15, 2024 | 11:30 PMUpdated Apr 15, 2024 | 11:30 PM
కొడుకు పుట్టినరోజుని ఈ తండ్రి సెలబ్రేట్ చేసిన తీరుకి హేట్సాఫ్ చెప్పొచ్చు!

సాధారణంగా ప్రతిఒక్కరి ఇంట్లో తమ పిల్లల పుట్టిన రోజు వస్తే ఏం చేస్తారు.. ఇది ఒక ప్రశ్న అని చాలామంది నవ్వుకుంటారు. ఎందుకంటే.. ఇంట్లో పిల్లల పుట్టినరోజు వస్తే ఏ రకంగా హంగామా ఉంటుదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగానే వారికి ఒకటి, రెండు జతల కొత్త దుస్తులను కొనుగోలు చేస్తారు. కాగా, పుట్టినరోజు ఉదయాన్నే తమ పిల్లలకు తలస్నానం చేసి.. కొత్త దుస్తులు ధరిస్తారు. ఆ తర్వాత.. గుడికి తీసుకు వెళ్లడం, ఇంట్లో పెద్ద వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం.. ఇక సాయంత్రం పిల్లల ఫ్రెండ్స్ ని పిలిచి కేక్ కట్ చేయించడం చేస్తారు. మరి గ్రాండ్ గా చేసుకోవాలి అనుకునే వారు చుట్టుపక్కల వారికి, బంధువులకు, ఫ్రెండ్స్ కు పిలిచి చాక్లెట్లు, స్వీట్లు, భోజనాలు వంటివి పెట్టడం అనేది మిడిల్ క్లాస్ ఇళ్లల్లో కామెన్ గా జరుగుతుంది.

అదే బాగా డబ్బున్న వాళ్లు అయితే వారి ఇళ్లలో పార్టీలు, కాస్ట్లీ గిఫ్టులు వంటి కథా అంత తెలిసిందే. అయితే ఇలా సంవత్సరంకు ఒకసారి వచ్చిన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ, వేలకు వేలు ఖర్చు పెట్టి బర్త్ డేలు చేసి స్టేటస్ చూపించుకోవడం కన్నా.. అదే రోజున ఎదుట వ్యక్తికి సాయం చేస్తే.. వారి కళ్లలో కనిపించే ఆనందం చూస్తే ఆ ఫీల్ వేరు. అప్పుడు కదా నిజంగా లైఫ్ లో ఏదో సాధించం, గొప్ప పని చేశాం అనే భావన కలుగుతుంది. అయితే, ఇలా ఇంత వరకు ఎవ్వరు తమ పిల్లల బర్త్ డేలకు వేలు తగలేట్టడమే తప్ప, ఎదుటవారికి సాయం చేసింది లేదు. కానీ, తాజాగా అసలు పిల్లల బర్త్ డేకి కొత్త అర్థం చెప్పేలా ఓ వీడియో అనేది నెట్టింట వైరల్ అవుతుంది.

తాజాగా ఓ పిల్లోడు బర్త్ డే సందర్భంగా..  తన తండ్రితో కలిసి ఎండలో పూలు అమ్ముకుంటున్న ఓ వృద్ధ మహిళకు వద్దకు వెళ్లారు. కాగా, అక్కడ ఆమెకు ఓ కొత్త గొడుగును అందజేశారు. అలాగే ఆ మహిళకు కొత్త దుస్తులు కూడా ఇచ్చారు. దీంతో ఆ వృద్ధ మహిళ కల్మషం లేని చిరు నవ్వుతో ఆ చిన్నోడిని ఎంతో ప్రేమగా  ఆశీర్వదించింది.  ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ తండ్రి, కొడుకులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు పెంపకం అంటే ఇలా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు. అలాగే మరో నెటిజన్ ఈసారి నా బర్త్ డే కూడా ఇలానే చేసుకుంటాను అని కామెంట్ చేశాడు.  మరొక నెటిజన్ డియర్ బాయ్.. నువ్వు సంతోషంగా ఇలానే 100 బర్త్ డేలు జరుపుకోవాలని కామెంట్ చేశారు. కనుక మీరు కూడా ఈసారి మీ బర్త్ డేస్ ను ఫ్రెండ్స్, పబ్బులు, పార్టీలు అని కాకుండా.. ఇలా ఒక్కసారి అయిన ట్రై చేసి చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి, కొడుకు బర్త్ డే రోజున ఆ తండ్రి చేసిన మంచి పని పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి