iDreamPost

మీరు Phonepe వాడుతున్నారా?.. సులభంగానే 5 లక్షల లోన్ పొందొచ్చు.. ఎలా అంటే?

మీరు ఫోన్ పే యూజర్లా? అయితే మీకు గుడ్ న్యూస్. ఫోన్ పే ద్వారా సులభంగానే రూ. 5 లక్షల లోన్ పొందొచ్చు. దీని కోసం ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే లోన్ కు అప్లై చేసుకోవచ్చు.

మీరు ఫోన్ పే యూజర్లా? అయితే మీకు గుడ్ న్యూస్. ఫోన్ పే ద్వారా సులభంగానే రూ. 5 లక్షల లోన్ పొందొచ్చు. దీని కోసం ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే లోన్ కు అప్లై చేసుకోవచ్చు.

మీరు Phonepe వాడుతున్నారా?.. సులభంగానే 5 లక్షల లోన్ పొందొచ్చు.. ఎలా అంటే?

ప్రస్తుత రోజుల్లో అంతా ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. కిరాణా కొట్టు నుంచి మొదలుకొని షాపింగ్ మాల్స్ వరకు డిజిటల్ చెల్లింపులే చేస్తున్నారు. రోజు వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్స్ యాప్స్ విరివిగా వాడుతున్నారు. దాదాపు స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతిఒక్కరి వద్ద ఈ యాప్స్ ఉంటున్నాయి. అయితే ఈ యాప్స్ లావాదేవీలకే కాదు.. లోన్స్ కూడా అందిస్తున్నాయి. కస్టమర్లకు ఉపయోగపడేలా చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు లోన్స్ అందిస్తున్నాయి. ఇది వరకు గూగుల్ పే తన యూజర్లకు లోన్ అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫోన్ పే తన కస్టమర్ల కోసం 5 లక్షల లోన్ అందిస్తోంది. మీరు సులభంగానే ఈ లోన్ ను పొందొచ్చు. ఎలా అంటే?

డబ్బు ఎప్పుడు అవసరం పడుతుందో చెప్పలేము. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాలంటే కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చుకుందామన్నా కుదరని పరిస్థితి ఉంటుంది. బ్యాంకుల్లో లోన్ తీసుకుందామంటే సమయం పడుతది. కానీ ఫోన్ పే ద్వారా నిమిషాల వ్యవధిలోనే లోన్ పొందొచ్చు. మీరు ఫోన్ పే వాడుతున్నట్లైతే ఈజీగా 25 వేల నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ఇన్‌స్టంట్ లోన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఫోన్ పే యూజర్లకు లోన్ అందించేందుకు ప్రిఫర్ అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

మీ ఫోన్ లో ఫోన్ పే యాప్ ఓపెన్ చేయగానే పలు స్లైడ్స్ కనిపిస్తాయి. వీటిల్లో ప్రిఫర్ పర్సనల్ లోన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు 2 నిమిషాల్లో రూ.25 వల నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ పొందొచ్చని ఉంటుంది. అప్లై నౌ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. కిందకు వస్తే లోన్ వివరాలు ఉంటాయి. ఇక్కడ మీకు కావాల్సిన ఎమౌంట్ ను ఎంచుకుని అవసరమైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. లోన్ చెల్లించేందుకు 6 నెలల నుంచి 48 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. వడ్డీ రేటు 18 శాతం నుంచి 36 శాతం వరకు పడుతుంది. ప్రాసెసింగ్ ఫీజు 3 శాతం నుంచి 5 శాతం వరకు ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి