iDreamPost

జనగణనలో 36 రకాల ప్రశ్నలు

జనగణనలో 36 రకాల ప్రశ్నలు

పదేళ్లకోసారి చేసే జనగణనకు కసరత్తు ప్రారంభమయ్యింది. ఎలాంటి పొరపాట్లు లేకుండా కార్యక్రమాన్ని పూర్తిచేసేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు. జనగణన–2021పై రాష్ట్రాల్లో అవగాహన కల్పించేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అందులో భాగంగా జనగణన, సిటిజన్‌ రిజిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు.

జనగణనకు సంబంధించిన చరిత్ర, చట్టబద్ధమైన విధివిధానాలు, సిబ్బంది బాధ్యతలు, విధులు, జీతాలు, ఆర్థికపరమైన అంశాలపై వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో 45 రోజుల పాటు మొదటి దశ జనగణన చేస్తారు. ఇందులో గృహాల లెక్కింపును పూర్తి చేస్తారు. రెండో దశలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనాభా వివరాలను సేకరిస్తారు. మూడో దశలో మార్చి 1 నుంచి 5 వనరకు రివిజనల్‌ పూర్తి చేస్తారు. తొలిసారిగా జనగణన కోసం మొబైల్‌ యాప్‌ను వినియోగించనున్నారు. అలాగే ఈసారి ఏకంగా 34 ప్రశ్నలతో సమాచారాన్ని సేకరించనున్నారు. గృహాలు, ఇంటి యజమానులు, ఇంట్లోని మౌలిక సదుపాయాలు, వ్యక్తిగత ఆస్తులు, వాహన వివరాలు, కుల, మత వివరాలు, చదువుల గురించి ప్రశ్నలు రూపొందించారు. ప్రయోగాత్మకంగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం, గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మండలాల్లో జనగణన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

జనగణనలో సాధారణంగా ఎక్కువ శాతం ఉపాధ్యాయులే పాల్గొంటూ ఉంటారు. కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేసేందుకు ఈ సారి ఏపీలో గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది, వలంటీర్లను కూడా వినియోగించుకోనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి