iDreamPost

UKలో ఉద్యోగం, లక్షల్లో జీతం! ఒక్క తప్పుతో అంతా మారిపోయింది!

విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. ఇంకొన్ని గంటల్లో ప్రయాణం. ఇరుగు పొరుగుకు వీడ్కోలు తెలిపేందుకు వెళ్లింది. కానీ ఊహించలేదు అదే అంతిమ వీడ్కోలు అవుతుందని. అంతలో ఫోన్ వస్తే.. తన ఇంటి బయట మాట్లాడుతుంది.

విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. ఇంకొన్ని గంటల్లో ప్రయాణం. ఇరుగు పొరుగుకు వీడ్కోలు తెలిపేందుకు వెళ్లింది. కానీ ఊహించలేదు అదే అంతిమ వీడ్కోలు అవుతుందని. అంతలో ఫోన్ వస్తే.. తన ఇంటి బయట మాట్లాడుతుంది.

UKలో ఉద్యోగం, లక్షల్లో జీతం! ఒక్క తప్పుతో అంతా మారిపోయింది!

కొన్ని కొన్ని సార్లు సరదాగా చేసిన పనులే మనల్ని ప్రమాదంలో నెడుతుంటాయి. కొన్ని అలవాట్లు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ఇదిగో ఈ ఫోటోలో నవ్వులు చిందిస్తున్న  ఈ అమ్మాయి ప్రాణం కూడా తనకు తెలియకుండా తాను చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా పోయింది. తల్లిదండ్రులు ఆమెపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ కానరాని లోకాలకు తిరిగి వెళ్లిపోయింది. విదేశాల్లో ఉద్యోగాన్ని సంపాదించి పేరెంట్స్ కు ఆసరాగా నిలుస్తుందనుకున్న అమ్మాయి.. ఊహకందని రీతిలో జీవితాన్ని ముగింపు పలికింది. ఆమె చావుకు కారణమైంది ఓ పువ్వు. అదేంటీ పువ్వులు మేలు చేస్తాయి కానీ.. హానీ చేయడం ఏంటీ అనుకుంటున్నారా..? అవును పువ్వులే ఆమెను బలితీసుకున్నాయి. అవే ఒలిండర్ అలియాస్ గన్నేరు పూలు.

మరికొన్ని గంటల్లో విదేశాలకు పయనం కావాల్సిన యువతి.. కాటికి వెళ్లింది. ఊసుపోక..  ఏమరపాటుగా నోట్లో పెట్టుకున్న పువ్వు ఆమె జీవితాన్ని హరించేసింది. పువ్వు నమలడం వల్ల యువతి చనిపోయిన వింత, విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అలప్పుజ కేరళలోని హరిపట్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల సూర్య సురేంద్రన్.. యుకేలో నర్సు ఉద్యోగం పొందింది. లక్షల్లో జీతం.  మరికొన్ని గంటల్లో ఆమె యుకేకు బయలు దేరాల్సి ఉంది. విదేశాలకు వెళుతున్నానన్న ఆనందంతో ఇరుగు పొరుగుకు వీడ్కోలు చెప్పేందుకు వెళ్లింది. కానీ ఊహించి ఉండదు.. అదే తన తుది వీడ్కోలు అవుతుందని. అయితే అంతలో ఫోన్ రావడంతో ఇంటి బయటకు వచ్చి.. అక్కడే ఉన్న గన్నేరు చెట్లు పువ్వు, ఆకులను ఏమరపాటుగా నమిలింది. వెంటనే ఊసేసింది కూడా.

ఇక సూర్య సురేంద్రన్ విదేశీ ప్రయాణం మొదలయ్యింది. నెడుంబస్సేరిలోని విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉండగా.. తొలుత అలప్పుజకు చేరుకుంది. అక్కడ ఆమెకు వాంతులు కావడం మొదలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాడు. అయితే ఇలా ఆకులు, పువ్వులు తినందని, అయితే వెంటనే ఊసేసినట్లు వైద్యులకు చెప్పాడు తండ్రి. వైద్యులు చికిత్స అందించి.. తిరిగి ఇంటికి పంపించేశారు. కానీ ఆమె పరిస్థితి విషమించింది. వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతు సోమవారం ఉదయం మృతి చెందింది. ఒలిమాండర్ (గన్నేరు) నుండి వచ్చే విషయం ఆమె గుండెపై తీవ్ర ప్రభావితం చూపించిందని, అదే ఆమె ప్రాణాలను తీసిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇందులో శక్తివంతమైన విషం ఉంటుందని, గుండె నాడీ వ్యవస్థపై ప్రభావితం చూపుతుందని వైద్యులు తెలిపారు. నర్సు అయ్యి ఇంటికి ఆసరాగా నిలుస్తుందనుకున్న యువతి..ఊహించని విధంగా మరణించి కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి