iDreamPost

నారప్పలో ఈ సీన్ గమనించారా? ఆస్కార్ లెవల్ యాక్టింగ్ ఇది!

వెంకటేష్, ప్రియమణి నటించిన నారప్ప సినిమా గురించి మీకు ఎంత తెలుసో తెలియదు గానీ ఈ సీన్ లో ఒక బెస్ట్ సీన్ ఉంది. ఆ సీన్ గురించి మీకు చాలా మందికి తెలిసే ఛాన్స్ ఉండదు. సినిమా చూసినప్పుడు చాలా మంది గమనించి ఉండకపోవచ్చు. ఆ విషయం ఇప్పుడు తెలిస్తే అవును నిజమే కదా అని మీరు థ్రిల్లింగ్ కి గురవుతారు.

వెంకటేష్, ప్రియమణి నటించిన నారప్ప సినిమా గురించి మీకు ఎంత తెలుసో తెలియదు గానీ ఈ సీన్ లో ఒక బెస్ట్ సీన్ ఉంది. ఆ సీన్ గురించి మీకు చాలా మందికి తెలిసే ఛాన్స్ ఉండదు. సినిమా చూసినప్పుడు చాలా మంది గమనించి ఉండకపోవచ్చు. ఆ విషయం ఇప్పుడు తెలిస్తే అవును నిజమే కదా అని మీరు థ్రిల్లింగ్ కి గురవుతారు.

నారప్పలో ఈ సీన్ గమనించారా? ఆస్కార్ లెవల్ యాక్టింగ్ ఇది!

నారప్ప సినిమా గురించే మీకు తెలిసే ఉంటుంది. తెలుగులో వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, గీతాకృష్ణ, రాజీవ్ కనకాల, రావు రమేష్, నాజర్ వంటి వాళ్ళు నటించారు. ధనుష్ నటించిన అసురన్ మూవీకి రీమేక్ గా వచ్చినప్పటికీ ఒరిజినల్ అనేది చెడిపోకుండా చాలా అద్భుతంగా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదే ఒరిజినల్ అన్నట్టు చేశారు. వెంకటేష్ చేసే రీమేక్ లు అలానే ఉంటాయి. ఒరిజినల్ ని మర్చిపోయేలా చేస్తారు. ఒరిజినల్ ని చెడగొట్టకుండా ఈ మూవీని తెరకెక్కించడంలో శ్రీకాంత్ అడ్డాల పాత్ర కూడా చాలా ఉంది. అయితే ఈ మూవీలో మీకు తెలియని ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ ఒకటి ఉంది. అదే సింగిల్ టేక్ లోనే ఒక సీన్ ని చిత్రీకరించడం. 

ఈ మూవీలో నారప్పకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు మునికన్నగా కార్తీక్ రత్నం నటించగా.. చిన్న కొడుకు సీనప్పగా గీతాకృష్ణ నటించాడు. సినిమాలో ఈ చిన్నోడి క్యారెక్టరే హైలైట్. ఈ మూవీలో సీనప్ప పండు సామిని చంపే సీన్ వస్తుంది. తన అన్న మునికన్నను చంపేసినందుకు ప్రతీకారంగా సీనప్ప పండు సామిని చంపేస్తాడు. ఆ తర్వాత వచ్చే సీన్ మొత్తాన్ని ఒకే ఒక టేక్ లో తీశారు. నారప్ప తన కొడుకుని, కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఊరు వదిలి పారిపోవడానికి సిద్ధమవుతూ ఉంటాడు. ఈ సీన్ లో వెంకటేష్, ప్రియమణి, రాజీవ్ కనకాల, గీతా కృష్ణ, చిన్న పాప మొత్తం ఐదుగురు నటించారు. 3 నిమిషాల 42 సెకన్ల పాటు ఉంటుంది ఈ సీన్.

సింగిల్ టేక్‌లో:

ఈ సీన్ ని సింగిల్ టేక్ లో చిత్రీకరించడం ఒక ఎత్తు అయితే.. ఈ సీన్ ని ఇంత పర్ఫెక్ట్ గా వచ్చేలా నటించడం మరొక ఎత్తు. వెంకటేష్, ప్రియమణి, రాజీవ్ కనకాల, గీతా కృష్ణ వీళ్లంతా పర్ఫెక్ట్ సింక్ లో నటించారు. ఒక్కొక్కరూ ఒక్కో చోట ఉంటారు. కెమెరా మూమెంట్ అనేది మారుతుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నటిస్తూ.. డైలాగ్స్ చెప్పాలి. అది కూడా సింగిల్ టేక్ లోనే మొత్తం సీన్ రావాలి. ఈ సింగిల్ టేక్ సీన్ ఒరిజినల్ వెర్షన్ అసురన్ లో కూడా ఉంది. దాన్ని మ్యాచ్ చేయాలి. అంతకంటే బాగా చేయాలి. నటీనటుల మీద అలానే టెక్నీషియన్స్ మీద చాలా ఒత్తిడి ఉంటుంది. ఏ ఒక్కరు కోఆర్డినేషన్ మిస్ అయినా సీన్ దెబ్బ తింటుంది.

ఆస్కార్ లెవల్ పెర్ఫార్మెన్స్ ఇది:

కానీ సింగిల్ టేక్ లో దాదాపు 4 నిమిషాల పాటు ఒకరి తర్వాత ఒకరు డైలాగ్స్ చెప్పడం.. దానికి తగ్గట్టు ఆ పాత్రలో లీనమవ్వడం.. రిలాక్స్ అనేది లేకుండా జాగ్రత్త పడడం.. ఇవన్నీ సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు. వీటన్నితో పాటు ఎక్కడా కూడా సింగిల్ టేక్ లో సీన్ రావడం కోసం చేస్తున్నాం అన్న భావన కలిగించకుండా.. చాలా సహజంగా నటించడం ప్లస్ పాయింట్. ఈ సీన్ లో వీళ్ళ నటనకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఆస్కార్ లెవల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నారప్ప మూవీతోనే బెస్ట్ సీన్ ఇదే. ఈ ఒక్క సీన్ సినిమాకి అతి పెద్ద అసెట్. అందుకే నారప్ప అంతలా ప్రశంసలు అందుకుంది. కావాలంటే మీరు కూడా ఈ సింగిల్ టేక్ లో తీసిన సీన్ ని చూడవచ్చు. వెంకటేష్, ప్రియమణి, రాజీవ్ కనకాల, గీతా కృష్ణలు ఎంత అద్భుతంగా నటించారో చూడండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి