బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి అక్టోబర్ మాసంలో ఎన్నికలు జరగనుండడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలలో ఎన్నికల వేడి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల మధ్య పొత్తుల అంశంపై ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయి.ఈరోజు పాట్నాలో జరిగిన జేడీయు కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆ పార్టీ అధినేత నితీశ్ కుమార్ ఎన్డీయేలో జేడీయు భాగస్వామిగా ఉంటుందని స్పష్టంచేశారు. అంతేకాకుండా బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 243 స్థానాలలో ఎన్డీయే కూటమి 200లకు పైగా సీట్లలో […]
పదేళ్లకోసారి చేసే జనగణనకు కసరత్తు ప్రారంభమయ్యింది. ఎలాంటి పొరపాట్లు లేకుండా కార్యక్రమాన్ని పూర్తిచేసేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు. జనగణన–2021పై రాష్ట్రాల్లో అవగాహన కల్పించేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అందులో భాగంగా జనగణన, సిటిజన్ రిజిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. జనగణనకు సంబంధించిన చరిత్ర, చట్టబద్ధమైన విధివిధానాలు, సిబ్బంది బాధ్యతలు, విధులు, జీతాలు, ఆర్థికపరమైన అంశాలపై వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 45 రోజుల పాటు మొదటి దశ జనగణన చేస్తారు. ఇందులో […]
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈసారి ఎలాగైనా అధికారంలోకి కైవసం చేసుకోవడానికి సర్వ శక్తులు ఒడ్డి పోరాడినప్పటికీ ఈరోజు విడుదలౌతున్న ఫలితాలలో AAP భారీ మెజారిటీతో విజయం సాధించి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు బిజెపికి వ్యతిరేకంగా ఒక్కసారిగా తమ స్వరాన్నిపెంచాయి. తాజాగా బిజెపి ఓటమి రూపంలో మోడీపైనా పోరాడడానికి కాంగ్రెసేతర విపక్షాల చేతికి ఆయుధం దొరికినట్టయింది. ఈనేపథ్యంలో అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ ఉదయం […]
రాష్ట్రాభివృద్ధి, ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా వివిధ అంశాలను అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తెచ్చినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. గురువారం పార్లమెంట్ భవనంలో అఖిలపక్ష సమావేశానికి హాజరైన అనంతరం వైఎస్సార్ సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. మైనారిటీ సోదరుల్లో అభద్రతకు కారణమైన ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పామని వైఎస్సార్ సీపీ లోక్ సభా పక్ష నేత మిథున్‌రెడ్డి తెలిపారు. వీటిపై సభలో […]
దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైన సీఏఏ,ఎన్నార్సి బిల్లును మొదటినుండి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తాజాగా కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన NPR(నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్) ను కూడా తమ రాష్ట్రంలో అమలు చేయబోమని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం NPR కోసం రూ.3,900 కోట్ల బడ్జెట్ కేటాయిచింది. ఇప్పటికే సీఏఏ,ఎన్నార్సి బిల్లులను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన పినరయి విజయన్ తాజాగా NPR ను తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని స్పష్టం […]