iDreamPost

వేసవి కాలంలో ట్రిప్ కి.. ఇండియాలోని టాప్ 10 చల్లనిప్రదేశాలు!

  • Published Apr 25, 2024 | 4:34 PMUpdated Apr 25, 2024 | 4:34 PM

వేసవి సెలవులు గడపడానికి చాలామంది ఎక్కువగా చల్లని పర్యాటక ప్రదేశాల కోసం వెళ్తుంటారు. అటువంటి వారికి అనుకూలంగా ఉండేందుకు.. ఇక్కడ కొన్ని చల్లని, అద్భుతమైన ప్రదేశాల జాబితాలు అందుబబాటులో ఉన్నాయి. ఇక  మీరు మీ ఫ్యామిలీతో గడపడానికి ఈ  ప్రదేశాలకు వెళ్లవచ్చు. మరి ఆ ప్రదేశాలంటే తెలుసుకుందాం.

వేసవి సెలవులు గడపడానికి చాలామంది ఎక్కువగా చల్లని పర్యాటక ప్రదేశాల కోసం వెళ్తుంటారు. అటువంటి వారికి అనుకూలంగా ఉండేందుకు.. ఇక్కడ కొన్ని చల్లని, అద్భుతమైన ప్రదేశాల జాబితాలు అందుబబాటులో ఉన్నాయి. ఇక  మీరు మీ ఫ్యామిలీతో గడపడానికి ఈ  ప్రదేశాలకు వెళ్లవచ్చు. మరి ఆ ప్రదేశాలంటే తెలుసుకుందాం.

  • Published Apr 25, 2024 | 4:34 PMUpdated Apr 25, 2024 | 4:34 PM
వేసవి కాలంలో ట్రిప్ కి.. ఇండియాలోని టాప్ 10 చల్లనిప్రదేశాలు!

దేశంలో ఈ ఏడాది ఎండాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భగ భగమంటూ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక భారీ ఉష్ణోగ్రతలతో ఎండలు దంచికొడుతున్న వేళ ప్రజలు బయటకు వెళ్లలేక అలా అని ఇంట్లో ఉండలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఈ సమయంలో ఈ వేసవి ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందడానికి ఏదైనా చల్లని ప్రాంతాలకు వెళ్లి సేదా తీరాలని ప్రతిఒక్కరూ అనుకుంటారు. పైగా ఇప్పుడు సమ్మార్ సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలో చల్లని ప్రదేశాలకు వెళ్లే టూరిజం సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇందుకోసం ఎక్కడెక్కడికి వెళ్లాలా.. అని తెగ ఆలోచనలో పడుతుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా దేశం విడిచి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం భారతదేశంలోనే కొన్ని ప్రాంతాలను సందర్శిస్తే చాలు. ఇక ఆ ప్రాంతాలు అనేవి ఈ వేసవి వేడి నుంచి చల్లదనాన్ని పంచుతాయి. మరి ఇక్కడ వేసవిలో విహరించడానికి అనుకూలమైన చల్లని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయో తెలుసుకుందాం.

వేసవి సెలవులు గడపడానికి చాలామంది ఎక్కువగా చల్లని పర్యాటక ప్రదేశాల కోసం వెళ్తుంటారు. అటువంటి వారికి అనుకూలంగా ఉండేందుకు.. ఇక్కడ కొన్ని చల్లని, అద్భుతమైన ప్రదేశాల జాబితాలు అందుబబాటులో ఉన్నాయి. ఇక  మీరు మీ ఫ్యామిలీతో గడపడానికి ఈ  ప్రదేశాలకు వెళ్లవచ్చు. మరి ఆ ప్రదేశాలంటే తెలుసుకుందాం.

కాశ్మీర్

కాశ్మీర్ అనేది సమ్మర్‌ కు చాలా స్పెషల్ టూరిస్ట్‌ ప్లేస్‌. కనుక కచ్చితంగా ప్రతిఒక్కరు వేసవిలో ఇక్కడకు వెళ్ళవచ్చు. ఇక ఇక్కడ  మొఘల్ గార్డెన్, తులిప్ గార్డెన్ వంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. మీరు పైగా ఇక్కడ షికారా రైడ్‌ని ఆస్వాదించవచ్చు.

సిక్కిం

సిక్కిం లో కూడా  పచ్చని లోయలు, సరస్సు అందాలను అస్వాధించవచ్చు. పైగా ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. ముఖ్యంగా ఈ ప్రదేశం ఫ్యామిలీ ట్రిప్‌కి చాలా బాగుంటుంది. ఇక్కడి అందమైన లోయలు మీ మనసును ఎంతగానో ఆకర్షిస్తాయి.

కూర్గ్

కూర్గ్  కర్ణాటకలోని అనేక హిల్ స్టేషన్లు ఉన్నాయి. పైగా కూర్గ్‌లోని పచ్చని దృశ్యాలు, చల్లని వాతావరణం ప్రతిఒక్కరికి ఎంతగానో నచ్చుతాయి. అలాగే ఇక్కడ మీరు ట్రెక్కింగ్, పక్షులను చూసి ఆనందించవచ్చు.

షిమ్లా

హిమాలయా పర్వత శ్రేణుల మధ్య ఉన్న షిమ్లా నగరం అనేది అద్భుతమైన ప్రకృతి అందాలకు నిలయం. ఇది వేసవిలోనూ చల్లని వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ప్రముఖ హిల్ స్టేషన్.  పైగా ఇక్కడి మాల్ రోడ్ లో కలియ తిరుగుతూ స్థానిక మార్కెట్లను అన్వేషించండి, బొమ్మ రైలులో ప్రయాణించండి, అలాగే ప్రఖ్యాత జఖూ ఆలయాన్ని సందర్శించండి. ఇక వేసవి మే నెలల్లో అయితే షిమ్లాలో పగటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ కు ఉంటుంది.

Shimla

 

ఊటీ

దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్, ఊటీని ‘క్వీన్ ఆఫ్ ది హిల్స్’ అని కూడా పిలుస్తారు. చుట్టూ నీలగిరి పర్వత శ్రేణులు, పచ్చదనంతో నిండిన ఈ హిల్ స్టేషన్ ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఊటీలో చూడదగిన ప్రదేశాలలో నీలగిరి పర్వత రైలు, బొటానికల్ గార్డెన్, పైకార సరస్సు, దొడ్డబెట్ట శిఖరం ఉన్నాయి. మే నెలలో పగటివేళ ఊటీలో సగటు ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.

ooty

 

కొడైకెనాల్

ఇక దక్షిణాదిలోని మరొక ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం కొడైకెనాల్.  ఇక్కడ  చుట్టూ పచ్చదనం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అలాగే కొండలు, లోయలతో ప్రకృతి సౌందర్యం నిండి ఉంది. ఇది కొత్తగా పెళ్లైన జంటలకు హనీమూన్ కూడా బెస్ట్ గా ఉంటుంది. ఇక వేసవిలో కొడైకెనాల్ లోని ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వీచే చల్లని గాలులను ఆస్వాదించడం కోసం నలుమూల నుండి పర్యాటకులు వస్తారు. మే నెలలో ఇక్కడ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. కొడైకెనాల్‌లోని ప్రధాన సందర్శనా స్థలాలలో గ్రీన్ వ్యాలీ వ్యూపాయింట్, బేర్ షోలా జలపాతం, కోకర్స్ వాక్ ఉన్నాయి.

Kodaikenal

చిరపుంజి

అలాగే దేశంలోని ఈశాన్య ప్రాంతంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో చిరపుంజి కూడా ఒకటి.  ఈ చిరపుంజి అనేది ఏడాది పాటు అత్యధిక వార్షిక వర్షపాతం కలిగిన ప్రాంతం. అలాగే ఎప్పుడు  చల్లగా మబ్బులతో కూడిన వాతావరణం ఆకాశంలో భారీ మేఘాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఇక  మీరు వర్షాలను ఇష్టపడితే చిరపుంజి తప్పక సందర్శించవలసిన ప్రదేశం. అలాగే ఆకుపచ్చని అడవులు, విభిన్న జంతుజాలం, గంభీరమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందిన చిరపుంజి వేసవిలో తప్పక సందర్శించాలి. ఇక్కడ మే నెలలో పగటి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 23 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి