iDreamPost

33 ఏళ్ళ హిందీ శివ..సెన్సేషనల్ టర్న్

సరింగా ఈ రోజుకి అంటే డిసెంబర్ 7వ తేదీనాటికి అక్కినేని నాగార్జున, అమల కాంబోలో రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం హిందీలో విడుదలై 33 ఏళ్ళయింది.

సరింగా ఈ రోజుకి అంటే డిసెంబర్ 7వ తేదీనాటికి అక్కినేని నాగార్జున, అమల కాంబోలో రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం హిందీలో విడుదలై 33 ఏళ్ళయింది.

33 ఏళ్ళ హిందీ శివ..సెన్సేషనల్ టర్న్

సరింగా ఈ రోజుకి అంటే డిసెంబర్ 7వ తేదీనాటికి అక్కినేని నాగార్జున, అమల కాంబోలో రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం హిందీలో విడుదలై 33 ఏళ్ళయింది. ఇప్పుడు కాదు, ఇప్పుడంటే రాజమౌళి నుంచి, ప్రశాంత్ నీల్ నుంచి నిన్న మొన్నటి సందీప్ వంగా వరకూ కూడా బాలీవుడ్ని గడగడలాడించినవాళ్ళే. కానీ ఈ ఊచకోత మొదలెట్టిన మొదటి మొనగాడు రామ్ గోపాల్ వర్మ, చరిత్ర సాక్షిగా. అసలు ఆ రోజున రామ్ గోపాల్ వర్మ చెప్పిన కథ, ఆ స్టయిల్ నాగార్జునకి ఎంత నచ్చినా సరే మిగతావారెవరూ వర్మకి ఓటు వేయలేదు. అన్ని వైపులా అభ్యంతరాలు, ఆటంకాలే వర్మకి.

అప్పుడే నాగార్జున ఏదైనా సీను వీడియో కెమెరాతో షూట్ చేసుకురమ్మంటే, కాలేజ్ దగ్గర జరిగిన సంఘర్షణ, నాగార్జున సైకిల్ చైన్ తీయడం.. ఆ సీను వర్మ షూట్ చేసి నాగార్జునకి చూపించాడని చెబుతారు. అది చూపించిన తర్వాతే వర్మని నాగార్జున గట్టిగా సమర్ధించాడన్నది గతం. అంతవరకూ ఇంగ్లీషు ఫిల్మ్స్ వీడియోలు చూసి, చూసి అ మేకింగ్ స్టయిల్ని వంటబట్టించుకున్న వర్మ శివ సినిమాని కేవలం ఇంగ్లీషు సినిమా ఫక్కీలోనే తీశాడు. గొల్లపూడి మారుతీరావు లాంటి పాప్యులర్ క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా వాళ్ళ డైలాగ్ డెలివరీ స్టయిల్ వద్దని చెప్పి, ఎంత ఎమోషనల్ డైలాగయినా సైలెంట్ గా, ఎమోషన్ లేకుండా చెప్పమని హెచ్చరించి మరీ చెప్పించాడు వర్మ.

nagarjun hindi shiva movie

రీరికార్డింగ్ కూడా అప్పటికే బడ్జెట్ ఎక్కువైపోయిందనే వర్రీతో బాంబే తీసుకెళ్ళి ట్రాక్స్ వేయించడానికి పూనుకున్నారు. కానీ ఒప్పుకోనిదల్లా ఒక్క నాగార్జునే ఆ ప్రపోజల్ కి. ఆ సినిమాకి మ్యూజిక్ చేసిన ఇళయరాజానే పిలిచి రీరికార్డంగ్ మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టి చేయించారు. ఫస్ట్ కాపీ చూసినవాళ్ళు ఫరవాలేదని చెప్పి వెళ్ళిపోయారు. ఎంతటి మేథావి శివ సినిమా చరిత్రగమనాన్ని మార్చేస్తుందని అంచనా వేయలేకపోయారు. తనకే తెలియదంటాడు వర్మ అయితే. ఇందులో మేటనీ ఆట ఉంది, బాటనీ పాఠముంది పాటతోనే అప్పటికి వేటూరి వరసలో ఎక్కడో దూరంగా కూర్చున్న సిరివెన్నల సీతారామశాస్త్రి ఒక్కసారిగా పాప్యులర్ అయికూర్చున్నారు.

nagarjun hindi shiva movie

అక్కడ నుంచే ఆయన హవా మొదలైంది. జెడి చక్రవర్తి, ఉత్తేజ్, మాటల రచయితగా, నటుడిగా కూడా తనికెళ్ళ భరణి వీళ్ళంతా తెరమీదకి వచ్చారు. ఇదంతా ఎందుకు రాస్తున్నామంటే…. ఇక్కడ మొదలైన శివ స్వైరవిహారం ఉత్తరాదిలో కూడా ప్రభంజనాలను పుట్టించింది. శివ సినిమా వచ్చిన తర్వాత తెలుగులోనే కాదు, హిందీలో కూడా శివలా తీయాలి, సినిమా అంటే శివలా ఉండాలి అనే వెర్రి మొదలైంది. కానీ, రామ్ గోపాల్ వర్మ ట్రెండ్ ని ఏ ఒక్కరూ కూడా అనుకరించలేకపోయారు. రామ్ గోపాల్ వర్మ ఒక్కడే.. శివ చిత్రం ఒక్కటే. అది హిందీ అయినా, తెలుగు అయినా కూడా.

                                                                                                                                                                                                              -నాగేంద్ర కుమార్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి