iDreamPost

కామారెడ్డిలో విషాదం.. వాగులో కొట్టుకుపోయిన 200 గేదెలు!

కామారెడ్డిలో విషాదం.. వాగులో కొట్టుకుపోయిన 200 గేదెలు!

కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు భీమేశ్వర వాగు ఉప్పొంగింది. ఈ వరద నీటిలో ఏకంగా 200 గేదెలు కొట్టుకుపోయాయి. రైతులు, గ్రామస్తులు అప్రమత్తమై ఆ గేదెలను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇక అతి కష్టంగా 100 గేదెలను కాపాడగా.., మిగిలిన వాటి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ మారుతుంది.

గ్రామస్తుల కథనం ప్రకారం.. జిల్లాలోని తాడ్వాయి మండలం సత్వాయిపేటలోని ఇటీవల కురిసిన వర్షాలకు భీమేశ్వర వాగు ఉప్పొంగింది. ఈ వరద నీరు దిగువ ప్రాంతాల వైపు వెళ్తుంది. అయితే ఈ క్రమంలోనే గురువారం చిట్యాల, సంతాయిపేట గ్రామ రైతులు పశువులను మేత కోసం అడవికి తీసుకెళ్లారు. అదే రోజు సాయంత్రం ఆ గేదెలను తిరిగి తీసుకొస్తున్న క్రమంలో ఉప్పొంగి వస్తున్న ఆ వాగు నీటిలో దాదాపు 200 గేదెలు కొట్టుకుపోయాయి. రైతులు కేకలు వేయడంతో గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

వాగులో కొట్టుకుపోతున్న ఆ గేదెలను కాపాడే ప్రయత్నంలో భాగంగానే 100 గేదెలను రక్షించారు. మిగిలిన వాటి కోసం రైతులు, గ్రామస్తులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా, ఆ గేదెలు వాగులో కొట్టుకుపోతుండగా కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఇవే దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి