iDreamPost

హ్యాట్సాఫ్: రోడ్డు కోసం సొంత ఇంటినే కూల్చిన BJP ఎమ్మెల్యే..!

కొంతమంది రాజకీయ నేతలు ఎన్నికల సందర్భంగా ఎన్నో వాగ్దానాలు చేస్తుంటారు.. తీరా గెలిచిన తర్వాత కనీసం కంటికి కూడా కనిపించరు. మరికొంత మంది రాజకీయ నేతలు మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతీది నెరవేర్చేందుకు కృషి చేస్తుంటారు.. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.

కొంతమంది రాజకీయ నేతలు ఎన్నికల సందర్భంగా ఎన్నో వాగ్దానాలు చేస్తుంటారు.. తీరా గెలిచిన తర్వాత కనీసం కంటికి కూడా కనిపించరు. మరికొంత మంది రాజకీయ నేతలు మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతీది నెరవేర్చేందుకు కృషి చేస్తుంటారు.. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.

హ్యాట్సాఫ్: రోడ్డు కోసం సొంత ఇంటినే కూల్చిన BJP ఎమ్మెల్యే..!

సాధారణంగా రోడ్డు విస్తరణ సమయంలో కొంతమంది ఇళ్లు, దుకాణ సముదాయాలు కోల్పోవాల్సి వస్తుంది. ఆ సమయంలో బాధితులు అధికారులతో వాగ్వాదానికి దిగుతుంటారు. ప్రభుత్వంపై వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నానా రచ్చ చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం పది మందికి పనికి వచ్చే పని అంటూ తమ సొంత స్థలాలు, ఇళ్లను స్వచ్ఛందంగా కూల్చి వేయడానికి ఒప్పుకుంటారు. అలా ఓ ఎమ్మెల్యే రోడ్డు విస్తరణ సందర్భంగా తన సొంత ఇంటిని కూల్చి వేతకు అనుమతి ఇచ్చారు. ప్రజలను తనను గెలిపించారని.. వారి కోసం తన ఇంటిని కూల్చి వేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు ఎమ్మెల్యే. వివరాల్లోకి వెళితే..

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కామారెడ్డి నియోజకవర్గం నుంచి మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేశారు. వారితో పాటు బీజేపీ అభ్యర్థిగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి పోటీ చేశారు. అనూహ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఘన విజయాన్ని సాధించారు. తాజాగా వెంకట రమణారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల రోడ్డు వెడల్పు ఎన్నో వివాదాలు చెలరేగాయి.. వాటన్నింటికి చెక్ పెడుతూ తాను ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చేసి మాట నిలబెట్టుకున్నారు వెంకట రమణారెడ్డి. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేట్ వరకు గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉండగా.. దీనిపై కొంత కాలంగా రగడ కొనసాగుతూ వచ్చింది.

MLA who demolished his own house for road

రోడ్డు వెడల్పు చేయకుండా చాలా మంది అక్కడ ఇళ్లను నిర్మించారు. ఇళ్ల ముందు కులాయి గుంతలు, షెడ్డులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ 30 ఫీట్లు మాత్రమే ఉంది. అయితే రోడ్డు వెడల్పు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చేయాలని కాటిపల్లి వెంకట రమణారెడ్డి భావించారు. ఈ కార్యక్రమాన్ని మొదట తన ఇంటి నుంచే ప్రారంభించాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో జేసీబీలతో దగ్గరుండి మరీ తన ఇంటిని కూల్చివేయించారు. అయితే ఇదే రోడ్డులో పంచముఖి హనుమాన్ ఆలయం ఉంది.. దానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూల్చివేత పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నెల రోజుల్లో ప్రస్తుతం ఉన్న రోడ్డుకు అదనంగా మరొక 24 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి