iDreamPost

10th క్లాస్ డైరీస్ రిపోర్ట్

10th క్లాస్ డైరీస్ రిపోర్ట్

అప్పుడెప్పుడో ఒకరికి ఒకరు, రోజా పూలుతో హీరోగా మనకు పరిచయమైన శ్రీరామ్ ఈ మధ్యకాలంలో తెలుగులో బాగానే కనిపిస్తున్నాడు. వెబ్ సిరీస్ లు, సినిమాలతో బిజీగా నటిస్తున్నాడు. నిన్న ఇతని కొత్త సినిమా టెన్త్ క్లాస్ డైరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గరుడవేగా కెమెరా మెన్ అంజి దర్శకత్వం వహించిన ఈ నోస్టాల్జియా డ్రామాలో అవికా గోర్, శ్రీనివాసరెడ్డి లాంటి తెలిసిన క్యాస్టింగ్ ఉండటంతో యూత్ లో ఓ మాదిరి ఆసక్తి నెలకొంది. అయితే ఓపెనింగ్స్ మాత్రం వీక్ గా ఉన్నాయి. విపరీతమైన పోటీ మధ్య థియేటర్లలో అడుగు పెట్టడమే కాక బజ్ కూడా తక్కువగా ఉంది. పెద్ద అంచనాలు లేకుండా వచ్చిన ఈ టెన్త్ క్లాస్ డైరీస్ రిపోర్ట్ చూద్దాం.

అమెరికాలో సెటిలైన సోము(శ్రీరామ్)జీవితంలో అన్ని సంపాదించినప్పటికీ ఏదో తెలియని అసంతృప్తితో బాధ పడుతూ ఉంటాడు. ఆఖరికి కట్టుకున్న భార్య వదిలేసి వెళ్ళిపోయినా దాని తాలూకు గాయం కన్నా ఇంకేదో వెలితి వెంటాడుతూ ఉంటుంది. ఈ సందర్భంలోనే తన తొలి ప్రియురాలు చాందిని(అవికా గోర్)గుర్తుకొస్తుంది. దీంతో ఆమెను వెతికేందుకు ఇండియా వచ్చేస్తాడు. స్కూల్ లో తన బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల రీ యూనియన్ ని ప్లాన్ చేసి క్లాస్ మేట్స్ హాజరయ్యేలా చేసుకుంటాడు. కానీ చాందిని రాదు. శ్రీరామ్ పరిస్థితి గమనించిన ఫ్రెండ్స్ అతనికి సహాయం చేసేందుకు నిర్ణయించుకుంటారు. మిగిలింది స్క్రీన్ మీదే తెలుసుకోవాలి.

పాత్రలకు తగ్గ క్యాస్టింగ్ ని సెట్ చేసుకున్నప్పటికీ శ్రీరామ్, అవికాల జంట అంతగా సెట్ అవ్వలేదు. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, జాను, విజయ్ స్నేహితుడు లాంటి సినిమాలు బాగా నచ్చేవాళ్లకు ఈ టెన్త్ క్లాస్ డైరీస్ ఓ మోస్తరుగా పర్లేదనిపిస్తుంది. సురేష్ బొబ్బిలి సంగీతం ఓకే కానీ మ్యూజికల్ గా ఇంకొంచెం శ్రద్ధ పెట్టి మంచి ఆల్బమ్ కంపోజ్ చేసి ఉంటే బాగుండేది. అంజి ఛాయాగ్రహణం చాలా బాగున్నా స్క్రీన్ ప్లే విషయంలో స్పీడ్ తగ్గడంతో కంటెంట్ ఎంగేజ్ చేయాలని ఎక్స్ పెక్ట్ చేసే వాళ్ళు నిరాశపడతాడు. కామెడీ కూడా అక్కడక్కడా పేలింది కానీ మరీ ఫ్రెష్ గా అనిపించదు. ఖచ్చితంగా థియేటర్లో చూడాలని రికమండ్ చేసే కంటెంట్ కూడా ఇందులో ఏమంత లేదు. స్టార్లు లేని ఇలాంటి సినిమాలను జనం దగ్గరకు తీసుకెళ్లాల్సింది ఓటిటిలే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి