iDreamPost

స్టార్ డైరెక్టర్ అవ్వాల్సిన సూర్య కిరణ్.. ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం?

Surya Kiran Passed away: నటి కళ్యాణి మాజీ భర్త, ప్రముఖ దర్శకులు, నటుడు సూర్య కిరణ్ సోమవారం చైన్నైలోని ఓ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.. దీంతో కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.

Surya Kiran Passed away: నటి కళ్యాణి మాజీ భర్త, ప్రముఖ దర్శకులు, నటుడు సూర్య కిరణ్ సోమవారం చైన్నైలోని ఓ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు.. దీంతో కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.

స్టార్ డైరెక్టర్ అవ్వాల్సిన సూర్య కిరణ్.. ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం?

సినీ ఇండస్ట్రీలో కొంతమంది నటీనటులు, దర్శక నిర్మాతలు తారా జువ్వలా వెలిగిపోయి.. అనుకోని పరిస్థితుల్లో తమ కెరీర్ ని ముగించిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ సూర్య కిరణ్ ఒకరు. దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. నటుడిగా ఎంతోమంది స్టార్ హీరోలతో నటించారు. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి దాదాపు రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించి రికార్డు క్రియేట్ చేశాడు. దర్శకుడు, నటుడుగానే కాదు కొరియోగ్రాఫర్ గా పలు చిత్రాల్లో తనదైన ట్రెండ్ సృష్టించారు సూర్య కిరణ్. అంత గొప్ప స్థాయిలో ఉన్న ఆయన అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.. అనారోగ్యంతో సోమవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం.

తమిళనాడులోని చెన్నైలో టీఎస్ మణి, రాధ తంపతులకు జన్మించాడు సూర్య కిరణ్. కేరళలోని త్రివేండ్రంకి చెందిన సూర్య కిరణ్ బాల నటుడిగా మాస్టర్ సురేష్ పేరుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆయనకు ఇద్దరు చెల్లెళ్లు. ఒక చెల్లి సుజిత ధనుష్ ఆమె కూడా పలు చిత్రాల్లో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సూర్య కిరణ్ రచయితగా మారాడు. వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుగా పలు సీచియల్స్ కి కథను అందించారు. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ కి దర్శకత్వం కూడా వహించారు. అలా దర్శకుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన పలు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. సూర్య కిరణ్ వివిధ రంగాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉండాలని భావించేవారు. ఇందులో భాగంగా కొరియోగ్రాఫర్ గా కూడా తన సత్తా చాటాడు.
మాస్టర్ సురేష్ గా కెరీర్ ప్రారంభించి దాదాపు 200 చిత్రాల్లో నటించారు.

చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, అమితా బచ్చన్ లాంటి దిగ్గజ హీరోలతో కలిసి నటించారు. 2002లో సత్యం మూవీతో తెలుగు దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన అరసి మూవీకి దర్శకత్వం వహించారు. రాక్షసుడు, స్వయంకృషి, దొంగమొగుడు, సంకీర్తన, ఖైదీ నెం 786, కొండవీటి దొంగ ఇలా పలు చిత్రాల్లో నటించారు. బాలనటుడిగా రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు, డైరెక్టర్ గా రెండు నందీ అవార్డులు అందుకున్నారు. నటుడు, దర్శకుడు, కొరియో‌గ్రఫర్ గా ఆయన కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇండస్ట్రీలో ఇంత గొప్ప పేరు ఉన్న ఆయన ప్రముఖ నటి కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
దర్శకుడిగా వరుస హిట్స్ అందుకున్న సూర్య కిరణ్ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమయ్యారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కళ్యాణితో మనస్పర్ధలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. అదే సమయంలో సూర్య కిరణ్ అప్పుల్లో కూరుకుపోయినట్లు వార్తలు వచ్చాయి. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఎవరికీ కనిపించకుండా అందరికీ దూరంగా ఉన్నారు సూర్య కిరణ్. 2020 లో బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్ట్ గా మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. తొలి వారంలోనే ఆయన ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. బిగ్ బాస్ తర్వాత సూర్య కిరణ్ మళ్లీ తెరపైకి రాలేదు. ఎలిమినేషన్ తర్వాత పలు ఛానల్స్ లో తన పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి ఎమోషనల్ అయ్యారు. భార్యాభర్తల బంధం తెంచేస్తే తెగిపోయేది కాదు.. ఈ జన్మకే కాదు.. ఇంకెన్ని జన్మలైనా కళ్యాణి నా భార్య. ఇప్పటికీ నా ల్యాప్ లాప్, సెల్ ఫోన్ లో తన తన ఫోటోనే ఉంటుంది.. ఆమె ఎప్పిటీకి నా గుండెలో పదిలాంగా ఉంటుంది.. అంటూ ఎమోషన్ అయ్యారు. అవే ఆయన చివరి మాటలు.

ఇండస్ట్రీలో వివిధ రంగాల్లో ఒక వెలుగు వెలిగిపోయిన సూర్య కిరణ్ తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇండస్ట్రీకి దూరం కావడం, ప్రేమించిన పెళ్లి చేసుకున్న భార్య దూరం కావడం, ఆర్థికంగా ఇబ్బందులు, అనారోగ్యం ఇలా ఎన్నో కారణాల వల్ల డిప్రెషన్ లోకి వెళ్లిన సూర్య కిరణ్ ఇటీవల పచ్చ కామెర్లు ముదిరిపోవడంతో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న సూర్య కిరణ్.. ఇలా అర్ధాంతరంగా కన్నుమూశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి