iDreamPost

రూ.5 వేలు ఉంటే చాలు.. సొంతూరిలో ఎలాంటి రిస్క్ లేని బిజినెస్!

  • Published Jun 14, 2024 | 5:33 PMUpdated Jun 14, 2024 | 5:33 PM

సాధారణంగా వ్యాపారం అనగానే భారీగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుదని అందరూ భయపడుతుంటారు. మరి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలంటే.. లాభాలు రాకపోతే ఎలా అనే ఆలోచనలో పడుతుంటారు. కానీ, రూ.5 వేలు ఉంటే చాలు.. సొంతూరిలో ఎలాంటి రిస్క్ లేని బిజినెస్ ఐడియా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అదేమిటంటే..

సాధారణంగా వ్యాపారం అనగానే భారీగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుదని అందరూ భయపడుతుంటారు. మరి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలంటే.. లాభాలు రాకపోతే ఎలా అనే ఆలోచనలో పడుతుంటారు. కానీ, రూ.5 వేలు ఉంటే చాలు.. సొంతూరిలో ఎలాంటి రిస్క్ లేని బిజినెస్ ఐడియా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అదేమిటంటే..

  • Published Jun 14, 2024 | 5:33 PMUpdated Jun 14, 2024 | 5:33 PM
రూ.5 వేలు ఉంటే చాలు.. సొంతూరిలో ఎలాంటి రిస్క్ లేని బిజినెస్!

ప్రస్తుత కాలంలో చాలామందికి సొంతగా ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచన చేస్తుంటారు. ముఖ్యంగా ఆ విషయంలో ఆ యువత అయితే మరింత ఆసక్తిని కనుబరుస్తుంటారు. కానీ, వ్యాపారం చేయాలంటే.. అంత ఖర్చుతో కూడుకున్న పని. మరి ఆ వ్యాపారంకు పెట్టుబడి కూడా చాలా అవసరం. అయితే ఈ పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాలంటే..కాస్త ఆలోచించాల్సిన పనే. ఎందుకంటే.. ఎక్కడ వ్యాపారంలో నష్టం వస్తే.. ఆర్థికంగా ఇబ్బందుల పడతామా.. అని చాలామంది భయపడి వ్యాపారం చేయాలంటే వెనుకడుగు వేస్తారు. కానీ, మరి కొంతమంది మాత్రం సొంత ఊరిలో, ఇంట్లో నష్టం లేకుండా, లాభాలు వచ్చేలా వ్యాపారం చేయాలని ఆలోచనలు చేస్తుంటారు. అందుకోసం రకరకాల బిజినెస్ ఐడియాలను వెతుకుతుంటారు. మరి, అలాంటి వారి కోసం రిస్క్ లేని ఓ కొత్త బిజినెస్ ఐడియా అనేది ఈరోజు మీ ముందుకు అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

సాధారణంగా వ్యాపారం అనగానే భారీగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుదని అందరూ భయపడుతుంటారు. మరి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయాలంటే.. లాభాలు రాకపోతే ఎలా అనే ఆలోచనలో పడుతుంటారు.కానీ, తక్కువ బడ్జెట్ తో మంచి లాభాలు వచ్చే ఓ మంచి బిజినెస్ ఐడియా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అదేమిటంటే.. ప్రస్తుతం దేశంలో పోస్టాఫీస్ లేని గ్రామం అంటూ ఎక్కడ లేదు. ముఖ్యంగా దేశంలో సుమారు 1.55 లక్షల పోస్టాఫీసులు ఉన్నాయి. అయితే తాజాగా ఈ పోస్టాఫీసుల మీద ఒత్తిడిని తగ్గించే నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు పోస్టాఫస్ ఫ్రాంచైజీలను తెరిచే అవకాశం కల్పిస్తున్నారు. కాగా, ఇందులో మనీ ఆర్డర్ పంపడం, స్టాంపులు, స్టేషనరీ పంపడం, పోస్ట్ పంపడం, అర్డర్ చేయడం వంటి సేవలను అందిస్తుంటారు. కనుక ఈ బిజినెస్ ప్రారంభించాలి అని మీరు అనుకుంటున్నరా అయితే దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు.

Post Office

అయితే ఈ కొత్త పోస్టాఫీసులను ప్రారంభించడానికి.. ఇందులో రెండు రకాల ఫ్రాంచైజీలు ఉన్నాయి. వీటిలో మొదటిది ఫ్రాంచైజీ అవుట్‌లెట్, రెండవది పోస్టల్ ఏజెంట్ల ఫ్రాంచైజీ. ఇది కాకుండా.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ పోస్టల్ స్టాంపులు, స్టేషనరీలను పంపిణీ చేసే ఏజెంట్లు ఉన్నారు. దీనిని పోస్టల్ ఏజెంట్ల ఫ్రాంచైజీగా పిలుస్తుంటారు. ఇకపోతే ఈ ఫ్రాంచైజీని తీసుకునే వారి వయసు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. కానీ, కుటుంబ సభ్యులు ఎవరూ పోస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో పచేస్తు ఉండకూడదు.ఇక ఫ్రాంచైజీని తీసుకునే వ్యక్తి తప్పనిసరిగా 8వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. అలాగే దీనిని ఈ ఫ్రాంచైజ్‌ ప్రారంభం చేయడానికి 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ కార్యాలయ ప్రాంతంను ఏర్పాటు చేయాలి.

అలాగే ఇది తెరవడానికి సెక్యూరిటీ కోసం మొత్తం రూ. 5000 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఇక లాభాల విషయానికొస్తే.. స్పీడ్‌ పోస్ట్‌కు రూ.5, మనీ ఆర్డర్‌కు రూ. 3 నుంచి రూ. 5, పోస్టల్‌ స్టాంప్‌, స్టేషనరీపై 5 శాతం కమిషన్‌ లభిస్తుంది. ఇక ఈ పోస్టాఫీసు బిజినెస్ కనుక మీకు నచ్చి వ్యాపారం చేయాలి అనుకుంటే.. పూర్తి వివరాల కోసం, దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. https://www.indiapost.gov.in/VAS/DOP_PDFFiles/Franchise.pdf మరి, వ్యాపారం చేయాలనుకునే వారికి సొంత గ్రామంలోనే అతి తక్కువ బడ్జెట్ తో అందుబాటులోకి వచ్చిన ఈ పోస్టాఫీసు ఫ్రాంచైజీ బిజినెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి