iDreamPost

మీ డబ్బు రెండింతలు కావాలా.. రైతుల కోసం సూపర్ స్కీం.. 5 లక్షలకి 10 లక్షలు పక్కా

మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే రైతుల కోసం సూపర్ స్కీం అందుబాటులో ఉంది. ఈ పథకంలో పెట్టుబడితే డబ్బు రెండితలు అవుతుంది. ఆ పథకం ఏంటంటే?

మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే రైతుల కోసం సూపర్ స్కీం అందుబాటులో ఉంది. ఈ పథకంలో పెట్టుబడితే డబ్బు రెండితలు అవుతుంది. ఆ పథకం ఏంటంటే?

మీ డబ్బు రెండింతలు కావాలా.. రైతుల కోసం సూపర్ స్కీం.. 5 లక్షలకి 10 లక్షలు పక్కా

పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ అధిక లాభాలు, సురక్షితమైన రాబడిని కోరుకుంటుంటారు. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్స్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయకుండా ప్రభుత్వానికి చెందిన పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు సామాన్య ప్రజల కోసం మంచి రాబడినిచ్చే పథకాలను తీసుకొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వార్యంలో నడుస్తున్న పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ లను అందిస్తున్నది. ఈ పథకాల ద్వారా కళ్లు చెదిరే లాభాలను అందుకోవచ్చు. ముఖ్యంగా రైతుల కోసం సూపర్ స్కీం అందుబాటులో ఉంది. అదే కిసాన్ వికాస్ పత్ర పథకం. దీనిలో పెట్టుబడి పెడితే అది రెండింతలు అవుతుంది. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలు అందుకోవచ్చు.

కిసాన్ వికాస్ పత్ర స్కీం రైతుల కోసం రూపొందించిన పథకం. ఈ పథకం పోస్టాఫీసులతో పాటుగా బ్యాంకుల్లో కూడా అందుబాటులో ఉంది. ఈ పథకంలో కనిష్టంగా 1000 ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్టంగా ఎంత పెట్టుబడైనా పెట్టుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ లో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడి 9.5 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. మీరు పెట్టిన పెట్టుబడి మొత్తంపై 7.5 శాతం వడ్డీరేటు అందించబడుతుంది. 18 ఏళ్లు పైబడిన వారు ఒక్కరిగా లేదా 3 కలిసి ఈ అకౌంట్ ప్రారంభించవచ్చు. 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న పిల్లలు గార్డియన్స్ సమక్షంలో ఈ స్కీమ్‌లో చేరవచ్చు.

5 లక్షలకి.. 10 లక్షలు:

కిసాన్ వికాస్ పత్ర పథకంలో రూ.5000 పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ తర్వాత రూ.10,000 పొందుతారు. అదే రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయానికి రూ. 10 లక్షలు పొందొచ్చు. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం.. ఈ పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, పథకం మెచ్యూరిటీ కాలానికి అంటే 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 5 నెలల్లో 10 లక్షల రూపాయలను తిరిగి పొందుతారు. అంటే, మీరు వడ్డీ నుంచి నేరుగా 5 లక్షల రూపాయలు అందుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశమే లేదు కాబట్టి ఎలాంటి భయం లేకుండా కిసాన్ వికాస్ పత్ర స్కీంలో పెట్టుబడి పెట్టొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి