iDreamPost

నేడు మలివిడత రైతు భరోసా..

నేడు మలివిడత రైతు భరోసా..

సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి సహాయం అందిచే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం గత ఏడాది ప్రారంభించిన వైఎస్సార్‌ రైతు భరోసా పథకం రెండో ఏడాదిలో మలివిడద నగదు జమను ఈ రోజు రైతుల ఖాతాల్లో వేయనున్నారు. ఏడాదికి 13,500 రూపాయలు అర్హులైన 50.47 లక్షల మంది రైతులకు మూడు విడతల్లో జమ చేసేలా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు.

మొదటి ఏడాది ఈ పథకం విజయవంతంగా పూర్తయింది. రెండో ఏడాదిలో ఇప్పటికే మొదటి విడత నగదు 7,500 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ రోజు రెండో విడత నగదు 4 వేల రూపాయలు రైతులకు చేరవేయనున్నారు. సంక్రాంతి సమయంలో చివరిదైన మూడో విడత నగదు రెండు వేల రూపాయలు జమ చేయనున్నారు.

ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ఈ హమీ ఇచ్చారు. ఇది నవరత్నాల్లో ఒకటి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే 2019 అక్టోబర్‌లో ఈ పథకం ప్రారంభించారు. మొదటి ఏడాది 46.69 లక్షల మంది రైతులకు ఈ పథకం కింద 6,173 కోట్ల రూపాయులు పెట్టుబడి సాయం అందించారు. ప్రతి ఏడాది అర్హులైన వారిని ఈ పథకంలో చేర్చుతున్నారు. రైతులు తమ పట్టాదార్‌ పాస్‌పుస్తకం, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్‌ గ్రామ సచివాలయాల్లో లేదా తమ వలంటీర్‌కు ఇస్తే చాలు.. ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు.

ఎప్పటికప్పుడు కొత్త అర్హులకు ఈ పథకం వర్తింపజేస్తుండడంతో ఈ ఏడాది పెట్టుబడి సాయం అందుకునే రైతుల సంఖ్య 50.47 లక్షలకు చేరుకుంది. వీరందరికీ 6,797 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందించనున్నారు. కౌలు రైతులు, గిరిజన రైతులకు కూడా ఈపథకం వర్తింపజేస్తున్నారు. మొత్తం మీద ఐదేళ్లలో ఈ పథకం ద్వారా రైతులకు 67,500 రూపాయలు లబ్ధి చేకూరనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి