iDreamPost

ఏపీలో రైతులకు శుభవార్త.. అకౌంట్‌లో డబ్బులు జమ

  • Published Nov 06, 2023 | 8:58 AMUpdated Nov 06, 2023 | 8:58 AM

అన్నదాతలకు జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రేపు అనగా నవంబర్‌ 7 మంగళవారం నాడు వారి ఖాతాలో డబ్బులు జమ చేయనుంది. ఆ వివరాలు. .

అన్నదాతలకు జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రేపు అనగా నవంబర్‌ 7 మంగళవారం నాడు వారి ఖాతాలో డబ్బులు జమ చేయనుంది. ఆ వివరాలు. .

  • Published Nov 06, 2023 | 8:58 AMUpdated Nov 06, 2023 | 8:58 AM
ఏపీలో రైతులకు శుభవార్త.. అకౌంట్‌లో డబ్బులు జమ

రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పెట్టుబడి సాయంగా రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ఇక ఏపీలో జగన్‌ సర్కార్‌ ప్రతి ఏటా రైతులకు 13,500 రూపాయల మొత్తాన్ని పెట్టుబడి సాయంగా అందజేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా  ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు జగన్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వారి ఖాతాలో డబ్బులు జమ చేయనుంది. ఆ వివరాలు..

వైఎస్‌ జగన్‌ మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగే బహిరంగ సభలో పాల్గొని.. రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. పుట్టపర్తి సభలో ప్రసంగించి.. ఆ తర్వాత రైతు భరోసా నిధుల్ని విడుదల చేస్తారు సీఎం జగన్‌. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం రెండో విడతలో భాగంగా రూ.4 వేల చొప్పున 53.53 లక్షల మంది ఖాతాల్లో రూ.2,204.77 కోట్లు జమ చేయనున్నారు.

వైఎస్సార్‌ రైతు భరోసా కింద రాష్ట్రంలో అర్హులైన రైతు కుటుంబాలకు ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఈ ఏడాదితొలి విడతలో భాగంగా ఇప్పటికే అర్హులైన రైతుల ఖాతాలో రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,942.95 కోట్ల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించారు. తాజాగా రెండో విడతలో భాగంగా రూ.4 వేల చొప్పున 53.53 లక్షల మంది ఖాతాల్లో రూ.2,204.77 కోట్లు విడుదల చేయనున్నారు.

వెబ్‌ల్యాండ్‌ ఆధారంగా అర్హులైన భూ యజమానులతోపాటు దేవదాయ, అటవీ(ఆర్‌వోఎఫ్‌ఆర్‌) భూములను సాగు చేసేవారే కాకుండా సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు కూడా తొలివిడతగా మే నెలలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడో విడతగా జనవరిలో రూ.2 వేలు చొప్పున ప్రతి ఏటా ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది.

వైఎస్సార్‌ రైతు భరోసా రెండో విడతలో భాగంగా అర్హత పొందిన సుమారు 53.53 లక్షల మంది రైతు కుటుంబాలకు 7వ తేదీన రెండో విడతగా రూ.2,204.77 కోట్ల సాయాన్ని అందించనున్నారు. ఈ మొత్తంతో కలిపితే ఈ ఏడాది రూ.6,147.72 కోట్ల మొత్తాన్ని రైతులకు అందజేసినట్లు అవుతుంది. తాజాగా జమ చేయనున్న రెండో విడత సాయంతో కలిపితే గత నాలుగున్నరేళ్లలో సగటున 53.53 లక్షల మందికి వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందచేసినట్లవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి