iDreamPost

మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి: CM జగన్

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో  మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా  రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేశారు. వరుసగా ఐదో ఏడాది.. రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబగడి సాయం జగన్ సర్కార్ పంపిణీ చేసింది.

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో  మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా  రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేశారు. వరుసగా ఐదో ఏడాది.. రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబగడి సాయం జగన్ సర్కార్ పంపిణీ చేసింది.

మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి: CM జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచి ప్రజాసంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. అంతేకాక వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. రైతులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు వైఎస్సార్ రైతు భరోసా వంటి పథకాలను ప్రవేశ పెట్టారు. వైఎస్సార్ రైతు భరోసా స్కీమ్ ద్వారా ఇప్పటికే  పలు విడతలుగా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేశారు. తాజాగా ఐదో ఏడాది..రెండో విడత నిధులను జగన్ సర్కార్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ఎమోషన్ల్ స్పీచ్ ఇచ్చారు.

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో  మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా  రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేశారు. వరుసగా ఐదో ఏడాది.. రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబగడి సాయం జగన్ సర్కార్ పంపిణీ చేసింది.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.  ఒక్క రైతు భరోసా పథకం ద్వారానే రూ.33 వేల 210 కోట్లు అందించామని తెలిపారు.  రైతులకు అండగా నిలిచేందుకుకు రూ. లక్ష 73 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం అన్నారు. అక్క చెల్లెమ్మల మంచి కోసం అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకాలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. “అబద్దాలు, మోసాలు చేసేందుకు పెద్ద పెద్ద మాటలు చెబుతారు. అలాంటి వారి మోసాలు అబద్దాలను నమ్మకండి.  ఈ నాలుగేళ్లలో మీ ఇంట్లో మంచి జరిగిందా.. లేదా మీరే చూడాలి. మీ బిడ్డ గెలిచేందుకు ఎల్లో మీడియా లాంటి సపోర్టు అవసరం లేదు. మీ బిడ్డ నమ్ముకుంది మిమ్మల్నే. మీకు మంచి జరిగి ఉంటే మీరే సైనికులుగా నిలబడండి” అంటూ సీఎం జగన్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.

ఇదే సభ నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సీఎం జగన్ మండిపడ్డారు. “చంద్రబాబుకు అధికారం  తన కోసం, తన గజదొంగల ముఠా కోసమే. పేదలు, అవ్వాతాతలు, నిరుద్యోగులు కోసం చంద్రబాబు ఆలోచన చేయడం లేదు. ఆ పెద్ద మనిషికి దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసు. చంద్రబాబు పేరు చేబితే అన్ని స్కామ్ లే గుర్తుకు వస్తాయి.  రాష్ట్రాన్ని దోచుకునేందుకు చంద్రబాబుకు అధికారం కావాలి. రైతులకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదు?.  మనస్సున్న మన ప్రభుత్వానికి మనసులేని ఆ ప్రభుత్వానికి  ఉన్న తేడాను గమనిచండి” అంటూ సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మరి.. సీఎం జగన్ ప్రసంగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి