iDreamPost

AP రైతులకు గుడ్ న్యూస్.. నేడే ఖాతాల్లోకి డబ్బులు

ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త అందించిది. నేడు రైతన్నల ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్, సున్నా వడ్డీ పథకాల నిధులను నేడు విడుదల చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త అందించిది. నేడు రైతన్నల ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్, సున్నా వడ్డీ పథకాల నిధులను నేడు విడుదల చేయనున్నారు.

AP రైతులకు గుడ్ న్యూస్.. నేడే ఖాతాల్లోకి డబ్బులు

రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతన్నలను ఆర్థికంగా ఆదుకునేందుకు వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతూ వారికి భరోసా కల్పిస్తోంది జగన్ సర్కార్. రైతులకు పంట పెట్టుబడికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. అదే విధంగా పండించిన పంటలకు సరియైన మద్దతు ధర కల్పిస్తూ రైతులు నష్ట పోకుండా చర్యలు తీసుకుంటుంది. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందిస్తూ రైతులను అక్కున చేర్చుకుంటుంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో నేడు(ఫిబ్రవరి 28 2024) వైఎస్ఆర్ రైతుభరోసా- పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి మూడో విడత నిధులను రైతుల అకౌంట్లలో జమ చేయనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి భారీ శుభవార్త. నేడు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమకానున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్, సున్నా వడ్డీ పథకాల నిధులను నేడు విడుదల చేయనున్నారు. రైతు భరోసా కింద 53.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున జమచేయనున్నారు. దీనికి సంబంధించి మొత్తం రూ. 1,078 కోట్లను విడుదల చేయనున్నారు. అదే విధంగా 2021-22 రబీ, 2022 ఖరీఫ్ లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10.78 లక్షల మంది అన్నదాతల అకౌంట్లలో రూ. 215.98 కోట్ల వడ్డీ రాయితీని జమ చేయనున్నారు.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తారు. రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ కింద అర్హులైన 64.37 లక్షల రైతులకు రూ.1,294.34 కోట్ల సాయం అందించనున్నారు. కాగా కేంద్రం అందిచే 6 వేల పీఎం కిసాన్ వాటా.. రాష్ట్రం అందించే రూ. 7500 కలుపుకుని ఒక్కో రైతుకు ఏడాదికి రూ. 13500 చొప్పున పెట్టుబడి సాయం అందుతోంది. ఖాతాల్లో డబ్బులు జమకానుండడంతో రైతులు ప్రభుత్వానికి ధన్యవాదాల తెలపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి