iDreamPost

APలోని రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజే అకౌంట్లోకి డబ్బులు..

  • Published Feb 26, 2024 | 9:15 AMUpdated Feb 26, 2024 | 9:15 AM

ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే వారి ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే వారి ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. ఆ వివరాలు..

  • Published Feb 26, 2024 | 9:15 AMUpdated Feb 26, 2024 | 9:15 AM
APలోని రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజే అకౌంట్లోకి డబ్బులు..

ప్రజలకు సంక్షేమ పాలన అందించడమే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన ధ్యేయం. ఇక అన్నదాతల కోసం జగన్‌ సర్కారు చేపడుతున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందించడం మాత్రమే కాక ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోతే.. ఏ సీజన్‌కు సంబంధించి ఆ సీజన్‌లోనే వారికి నష్టపరిహారం అందిస్తూ.. అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ఈ క్రమంలో తాజాగా ఏపీ సర్కార్‌ రైతులకు శుభవార్త చెప్పింది. త్వరలోనే వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని ప్రకటించింది. ఆవివరాలు..

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పింది. 2023-24 సీజన్‌కు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత నిధుల విడుదల తేదీని ప్రకటించింది. వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత పెట్టుబడి సాయంతో పాటు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా ఒకేసారి అన్నదాతల ఖాతాలో జమ చేసేందుకు రెడీ అవుతోంది. ఫిబ్రవరి 28వ తేదీన సీఎం జగన్‌.. రైతుల అకౌంట్లో ఇందుకు సంబంధించి డబ్బులను జమ చేయనున్నారు. దీనిలో భాగంగా రైతుభరోసా పెట్టుబడి సాయం కింద అర్హులైన రైతులకు రెండు వేల చొప్పున వారి అకౌంట్లలో జమచేస్తారు. మొత్తంగా రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ కింద అర్హులైన 64.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,294.34 కోట్ల సాయం అందించనున్నారు సీఎం జగన్‌.

రైతు భరోసా మూడో విడత పెట్టుబడి సాయం కింద 53.58 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున రూ.1,078.36 కోట్లు అందజేయనున్నారు సీఎం జగన్‌. అలాగే 2021-22 రబీ సీజన్, 2022 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 10.79 లక్షల మంది రైతులకు సున్నా వడ్డీ రాయితీ కింద రూ.215.98 కోట్లు జమ చేస్తారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి ఈ మొత్తాన్ని రైతు ఖాతాల్లో జమ చేయనున్నారు.

పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు 6 వేల రూపాయల సాయం అదిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్‌ సర్కార్‌.. రైతు భరోసా పథకం కింద మరో 7,500 రూపాయలతో కలిపి ఏటా 13వేల 500 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అర్హులైన రైతులకు మూడు విడతల్లో ఈ సాయం అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా 2023–24 సంవత్సరం తొలి విడతలో భాగంగా 52,57,263 రైతు కుటుంబాలకు రూ.3,942.95 కోట్ల సాయం అందించారు సీఎం జగన్‌. ఇక రెండో విడతలో 53,52,905 కుటుంబాలకు గాను రూ.2,204.77 కోట్లు సాయం అందించారు. మూడో విడతలో భాగంగా ఫిబ్రవరి 28న 53,58,368 రైతుల ఖాతాల్లో రూ.1,078.36 కోట్లు జమచేయనున్నారు సీఎం జగన్‌.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి