iDreamPost

అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలి – సీఎం వైఎస్‌ జగన్‌

అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలి – సీఎం వైఎస్‌ జగన్‌

ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని తన ప్రభుత్వం మొదటి నుంచి అడుగులు వేస్తోందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ప్రారంభించారు. దాదాపు 500 వాహనాలను జెండా ఊపి రాష్ట్రం నలుమూలలా పంపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు.

‘‘ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 500 ఎయిర్‌ కండిషన్డ్‌ వాహనాలను రాష్ట్ర నలుమూలలా పంపుతున్నాం. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు మంచి జరగలాని తన ప్రభుత్వం మొదటి రోజు నుంచి అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రభుత్వం తోడుగా ఉండేందుకు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ చెల్లెమ్మ 108 ఫోన్‌ చేస్తే.. వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లడమే కాకుండా.. డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే మందులు ఇస్తున్నాం. సాధారణ కాన్పు అయితే మూడు వేల రూపాయలు, సిజేరియన్‌ అయితే ఐదు వేల రూపాయలు ఆ చెల్లెమ్మల చేతుల్లో పెడుతూ.. డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ఇంటి వద్ద దింపే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

గతంలో ఎలాంటి పరిస్థితి ఉండేదో అందరం చూశాం. అరకొర వాహనాలు, ఉన్న వాటిలోనూ వసతులు సరిగా ఉండవు. ఈ పరిస్థితి నుంచి మెరుగైన వసతులు ఉండేలా వాహనాలను తీసుకొచ్చాం. 108, 104 వాహనాలను, ఆస్పత్రులను నాడు – నేడు ద్వారా అభివృద్ధి చేశాం. ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ, అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని ఆశిస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభిలషించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి