ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అనేక పథకాలను ప్రవేశ పెట్టారు. అలానే పేద విద్యార్థులకు చదువులో ఎలాంటి ఆటకం కలగకూడదని.. ఆర్థిక భరోసా ఇచ్చేందుకు అనే పథకాలను ప్రారంభించారు. అలానే పేదింటి ఆడపిల్ల పెళ్లి విషయంలో వారి తల్లిదండ్రులు అప్పులు పాలవ్వకూడదని వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా ప్రారంభించారు. తాజాగా ఈ స్కీమ్ ల నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ప్రతి ఒక్కరి చేతుల్లో చదువు అనే బ్రహ్మాస్త్రంలో ఉండాలని సీఎం జగన్ అన్నారు.
ఈ సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాధీ తోఫా అమలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం బటన్ నొక్కి వధువుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా అనే రెండు.. ఆడ పిల్లలు ఉన్నత చదువులు చదివేట్లు .. వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే మంచి కార్యక్రమాలని ఆయన తెలిపారు.
ప్రతి ఒక్కరి చేతిలో చదువు అనే బ్రహ్మాస్త్రం ఉండాలని సీఎం జగన్ తెలిపారు.పేద తల్లిదండ్రులందరూ తమ పిల్లలను గొప్పగా చదివించి, వారి పెళ్లి కూడా గౌరవంగా అప్పుల పాలవ్వకుండా చేయాలని కోరుంటారని, అలాగే జరగాలని ఆశిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇక పేదరికంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, దివ్వాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లల కోసమే ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు సీఎం తెలిపారు. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, అప్పులు పాలయ్యే పరిస్థితి లేకుండా పెళ్ళిళ్లు జరిగే పరిస్థితి రావాలని కోరున్నారు. పేద పిల్లలు.. ప్రతి ఒక్కరూ డిగ్రీవరకు చదువుకునే పరిస్థితి రావాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమంలో చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. మరి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధుల విడుదల!