iDreamPost

కృష్ణా జిల్లాలో CM జగన్ కి స్వాగతం పలికిన వైఎస్ భారతి!

YS Bharathi Reddy Welcomes CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరుకుంది. అధికార, ప్రతిపక్ష నేతలు ముమ్మర ప్రచారాలతో దూసుకుపోతున్నారు.

YS Bharathi Reddy Welcomes CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరుకుంది. అధికార, ప్రతిపక్ష నేతలు ముమ్మర ప్రచారాలతో దూసుకుపోతున్నారు.

కృష్ణా జిల్లాలో CM జగన్ కి స్వాగతం పలికిన వైఎస్ భారతి!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ముమ్మరంగా ప్రచారాలతో దూసుకుపోతున్నారు. అధికార పార్టీ గద్దె దింపడానికి ప్రతిపక్ష పార్టీలు తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ప్రచారాలు చేస్తుంటే.. వైఎస్సాఆర్‌సీపీ ఒంటరిగా పోరుకు సిద్దమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్దం’ అంటూ బస్సు యాత్ర మొదలు పెట్టారు. ఆ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది.. ఎక్కడికి వెళ్లినా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. నేడు ఎన్టీఆర్ జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓ అపురూప దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఏపీలో ఎన్నికల సమరం హూరా హూరీగా కొనసాగుతుంది.. ప్రచారాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. రెండోసారి తమకు అధికారం ఇవ్వాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మొదలు పెట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎండ, వాన లేక్క చేయకుండా అభినులు ఆయనకు నీరాజనాలు పలుకుతున్నారు. నేడు ఎన్టీఆర్ జిల్లాలోకి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. ప్రకాశం బ్యారేజ్ పై అరుదైన దృశ్యం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. సీఎం జగన్ బస్సు యాత్ర జన ప్రవాహంలా కనిపిస్తుంది. తాడేపల్లి జంక్షన్ లో సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్రకు ఆయన సతీమణి వైఎస్ భారతి సంఘీభావం తెలిపారు. బస్సు యాత్ర మార్గంలో సామాన్య జనంతో కలిసిపోయిన ఆమె ఓ సామాన్యురాలిగా సీఎం జగన్ కి అభివాదం చేస్తూ కనిపించింది.

YS bharathi welcoming CM jagan

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రజలతో ఉన్నవారే.. ప్రజల కష్టాలు తెలుసుకుంటారు.. అందుకే వైఎస్ జగన్ అంటే ప్రజలు అంతగా అభిమానిస్తారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయం ఉంది. ఏప్రిల్ 26 న నామినేషన్ల పరిశీలన తర్వాత 29వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ సమయం ఉంది. మేమంతా సిద్దం సభలతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సీఎం జగన్ ఏప్రిల్ 24 న ఇచ్చాపురంలో చివరి సభ ముగించుకొని పులివెందుల చేరుకోనున్నారు. 25న నామినేషన్ వేసిన తర్వాత పులివెందులలో భారీ బహిరంగ సభలో మాట్లాడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి