P Venkatesh
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం తీవ్ర కలకలంరేపిన విషయం తెలిసిందే. మత్య్సకారుల బోట్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. అయితే దీని వెనక యూట్యూబర్ లోకల్ బాయ్ నాని ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తాజాగా బయటకు విడుదలయ్యారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం తీవ్ర కలకలంరేపిన విషయం తెలిసిందే. మత్య్సకారుల బోట్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. అయితే దీని వెనక యూట్యూబర్ లోకల్ బాయ్ నాని ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తాజాగా బయటకు విడుదలయ్యారు.
P Venkatesh
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నం ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భారీగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నటువంటి మత్య్సకారులకు చెందిన 60 బోట్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. దీంతో పాటు బోట్లలో ఉన్న మత్య్స సంపద కూడా అగ్నికి ఆహూతయ్యింది. దీంతో వందల కోట్ల నష్టం వాటిల్లింది. అప్పులు చేసి బోట్లు కొనుక్కుని ఉపాధి పొందుతున్న మత్య్సకారులు ఒక్కసారిగా బోట్లు కాలి బూడిదవ్వడంతో బోరున విలపించారు. అయితే ఈ ఘెర ప్రమాదం వెనక యూట్యూబర్ లోకల్ బాయ్ నాని ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా విడుదల చేశారు. పోలీసుల అదుపు నుంచి బయటకు వచ్చిన లోకల్ బాయ్ నాని మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
యూట్యూబర్ లోకల్ బాయ్ నాని చేపల వేటకు సంబంధించిన విషయాలు, వారి లైఫ్ స్టైల్ కు చెందిన వీడియోలను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తుంటాడు. దీంతో ఫేమస్ యూట్యూబర్ గా మారిపోయారు. అయితే ఇటీవల విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంతో హాట్ టాపిక్ గా మారాడు. అగ్ని ప్రమాదం వెనక లోకల్ బాయ్ నాని హస్తం ఉందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది. ఈ క్రమంలో అతడు బయటకు విడుదలయ్యాడు. ఈ సందర్భంగా లోకల్ బాయ్ నాని మాట్లాడుతూ.. కావలనే నాపై కుట్ర పన్నారు. నేను ఏ విధమైన తప్పు చేయలేదు. నా జీవితాన్ని నాశనం చేయాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశాడు. బోట్లను నేనెందుకు తగలబెడతానంటూ భావోద్వేగానికి గురయ్యాడు. నేను ఏ తప్పు చేయలేదని నిర్ధోషిగా బయటకు వస్తానని లోకల్ బాయ్ నాని తెలిపాడు.