iDreamPost
android-app
ios-app

వీడియో: వైన్స్ ముందు బీర్ కోసం కొట్టుకున్న యువకులు!

వీడియో: వైన్స్ ముందు బీర్ కోసం కొట్టుకున్న యువకులు!

ఈ రోజుల్లో చాలా మంది యువకులు బీర్ తాగేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇంటర్ కుర్రాళ్ల నుంచి ఉద్యోగుల వరకూ అందరూ బీర్ తాగడం ట్రెండ్ గా భావిస్తూ సీసాలకు సీసాలు తాగేస్తున్నారు. చదువుకునే వయసులో మద్యానికి అలవాలు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీలో కొందరు యువకులు బీర్ కోసం వైన్స్ ముందే కొట్టుకున్నారు. దీనిని గమనించిన స్థానికులు వారికి సర్దిచెప్పాల్పే ప్రయత్నం చేశారు. మరి కొందరు మాత్రం సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పరిధిలోని రాజిపేట ప్రాంతానికి చెందిన ఆబోతుల హరిబాబు అనే యువకుడు ఇటీవల బీర్ కోసమని స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ మద్యం దుకాణానికి వెళ్లి.. కూల్ బీర్లు కావాలని సిబ్బందిని అడిగాడు. ఆ షాపులో ఉన్న ఓ వ్యక్తి వెంటనే స్పందించి.. కూల్ బీర్లు లేవని సమాధానం ఇచ్చాడు. ఇదే విషయమై హరిబాబు, వైన్స్ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక వీరి గొడవ తీవ్ర రూపం దాల్చడంతో దాడి కూడా చేసుకున్నారు. ఈ గొడవలో హరిబాబు తలకు తీవ్రంగా గాయమైంది.

స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన హరిబాబును స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే వాళ్లు గొడవ పడుతుండగా కొందరు వ్యక్తులు వీడియో తీశారు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఇకపోతే ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ ఆగ్రహం వక్తం చేస్తున్నారు. తాగుబోతులుగా మారి ఇలా నడి రోడ్డుపై బీర్ కోసం కొట్టుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఇలా రోడ్డుపై బీర్ల కోసం కొట్టుకోవడం సిగ్గుచేటు అని కామెంట్స్ చేస్తున్నారు. యువకులు బీర్ కోసం కొట్టుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: వీడియో: చూస్తుండగానే పేలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet