iDreamPost

CM Jagan: నెల్లూరు రాజకీయం మార్చేసిన జగన్… ఇక క్లీన్ స్వీప్ పక్కా!

  • Published Mar 02, 2024 | 11:49 AMUpdated Mar 02, 2024 | 2:30 PM

ఒక్క నిర్ణయంతో నెల్లూరు రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ఇక నెల్లూరులో వైసీపీ క్లీన్‌ స్వీప్‌ పక్కా అంటున్నారు. ఆ వివరాలు..

ఒక్క నిర్ణయంతో నెల్లూరు రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ఇక నెల్లూరులో వైసీపీ క్లీన్‌ స్వీప్‌ పక్కా అంటున్నారు. ఆ వివరాలు..

  • Published Mar 02, 2024 | 11:49 AMUpdated Mar 02, 2024 | 2:30 PM
CM Jagan: నెల్లూరు రాజకీయం మార్చేసిన జగన్… ఇక క్లీన్ స్వీప్ పక్కా!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు మరో 45 రోజులు మాత్రమే సమయం ఉంది అని ఇప్పటికే ప్రచారం సాగుతోంది. ఇక రానున్న ఎన్నికల్లో విజయం సాధించడం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే రంగంలోకి దిగారు. అభ్యర్థులను ప్రకటిస్తూ.. ప్రచార కార్యక్రమాలు ప్రారంభించి.. ఎన్నికల కదనరంగంలో దూసుకుపోతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో జగన్‌ ఒక్కడే ఒంటరి పోరుకు రెడీ అవుతుండగా.. టీడీపీ, జనసేన నేతలు పొత్తులు పెట్టుకుని.. కూటమిగా పోటీ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఇరు పార్టీల అధ్యక్షులు మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇదిలా ఉంటే.. జగన్‌ మాత్రం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నెల్లూరు లోక్‌సభ స్థానానికి ఎంపీ విజయసాయి రెడ్డిని సమన్వయకర్తగా ప్రకటించి టీడీపీ ఆశలపై నీళ్లు కుమ్మరించారు. జగన్‌ ప్రకటనతో ఇక నెల్లూరులో వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని భావిస్తున్నారు.

ఏపీ రాజకీయాల్లో నెల్లూరు చాలా కీలకమైన స్థానం. ఇక్కడ వైసీపీకి మంచి పట్టుంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ నెల్లూరు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లాలో వైసీపీకి ముఖ్యనేతలైన ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు పార్టీని వీడారు. ఇక తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి కూడా వైసీపీ నుంచి బయటకు వెళ్లారు. నెల్లూరులో అధికార పార్టీ కీలక నేతలంతా బయటకు వెళ్లడంతో కేడర్‌లో ఆందోళన మొదలయ్యింది. కీలక నాయకులు వైసీపీని వీడటంతో.. ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితులు.. కేడర్‌లో అయోమయం నెలకొన్నాయి.

ఇక నెల్లూరులో వైసీపీ కీలక నేతలంతా పార్టీని వీడటంపై టీడీపీ హర్షం వ్యక్తం చేసింది. వైసీపీ రెబల్‌ నేతల సాయంతో.. రానున్న ఎన్నికల్లో నెల్లూరులో పాగా వేయాలనే ప్లాన్‌లో ఉంది. కానీ జగన్‌ చేసిన ఒక్క ప్రకటనతో ఇటు కేడర్‌లో ఊపు.. అటు టీడీపీలో భయం ఒకేసారి బయటకు వచ్చాయి. నెల్లూరు వైసీపీ లోక్‌సభ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్‌ నేత విజయసాయి రెడ్డి పేరు ప్రకటించి.. హైవోల్టేజ్‌ షాకిచ్చారు జగన్‌. విజయ సాయిరెడ్డి పేరును ఆయన సొంత జిల్లా నెల్లూరు ఎంపీ సీటుకు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

నెల్లూరులో కీలక నేతలు బయటకు వెళ్లడంతో అక్కడ కార్యకర్తలు, నేతలు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఒక్క నిర్ణయంతో ఈ సమస్యను పరిష్కరించారు జగన్‌. పార్టీలో ఎంతో సీనియర్‌ నేత, వైసీపీలో కీలక వ్యూహకర్త అయిన విజయసాయిరెడ్డిని ప్రత్యక్ష ఎన్నికల బరిలో దింపడమే కాక.. నెల్లూరు నుంచే పోటీ చేయిస్తుండటంతో ఇక్కడ రాజకీయం ఒక్కసారిగా మారింది. నెల్లూరు విజయసాయిరెడ్డి సొంత జిల్లా కావడంతో ఆయనకు ఇక్కడ రాజకీయాలపై ఎంతో అవగాహన ఉంది.

ఇక నెల్లూరులో ఏర్పడిన సంక్షోభాన్ని పరిష్కరించాలంటే.. విజయసాయి రెడ్డి లాంటి సీనియర్‌ అయితనే బాగుంటుందని భావించిన జగన్‌ ఆమేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై వైసీపీ కేడర్‌ హర్షం వ్యక్తం చేస్తుండగా.. రెబల్ నేతలు, టీడీపీ నేతల ముఖాలు మాడిపోయాయి.. జగన్‌ దెబ్బకు బిక్క చచ్చిపోయారు అంటున్నారు రాజకీయ పండితులు. మరి వైసీపీ నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ప్రకటించిన జగన్‌ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి