iDreamPost
android-app
ios-app

సచిన్, విరాట్ లకు సాధ్యం కాలేదు.. బ్రాడ్ మన్ తర్వాత జైస్వాల్ దే ఈ ఘనత!

  • Published Feb 26, 2024 | 5:15 PM Updated Updated Feb 26, 2024 | 5:15 PM

సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీలు సాధించలేని రికార్డును యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ సాధించి చూపించాడు. ఈ క్రమంలోనే సర్ డాన్ బ్రాడ్ మన్ తర్వాత ఈ రికార్డు సృష్టించిన ప్లేయర్ గా నిలిచాడు.

సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీలు సాధించలేని రికార్డును యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ సాధించి చూపించాడు. ఈ క్రమంలోనే సర్ డాన్ బ్రాడ్ మన్ తర్వాత ఈ రికార్డు సృష్టించిన ప్లేయర్ గా నిలిచాడు.

సచిన్, విరాట్ లకు సాధ్యం కాలేదు.. బ్రాడ్ మన్ తర్వాత జైస్వాల్ దే ఈ ఘనత!

ఇంగ్లండ్ తో జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. రాంచీ వేదికగా జరిగిన కీలకమైన నాలుగో మ్యాచ్ లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఇక ఈ సిరీస్ లో ఇంగ్లండ్ టీమ్ కు అసలైన బజ్ బాల్ క్రికెట్ ను చూపిస్తూ.. పరుగుల వరదపారిస్తున్నాడు యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్. బ్యాటింగ్ తో సునామీ సృష్టించడమే కాకుండా.. పలు భారీ రికార్డులను బద్దలుకొడుతూ దూసుకెళ్తున్నాడు. తాజాగా మరో ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అయితే ఈ రికార్డు భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్, విరాట్ కోహ్లీలకు కూడా సాధ్యం కాలేదు.

యశస్వీ జైస్వాల్.. టీమిండియాలో ఇప్పుడీపేరు ఓ సంచలనం. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో పరుగుల సునామీ సృష్టిస్తూ.. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. యశస్వీ బ్యాటింగ్ జోరుతో.. 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే జైస్వాల్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సచిన్, కోహ్లీ లాంటి బ్యాటర్లకు సాధ్యం కాని రికార్డును జైస్వాల్ సాధించాడు. ఇక ఈ రికార్డుతో ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్, దిగ్గజం సర్ డాన్ బ్రాడ్ మన్ తర్వాత నిలిచాడు జైస్వాల్. ఈ మ్యాచ్ తో జైస్వాల్ తన కెరీర్ లో ఆడింది కేవలం 8 మ్యాచ్ లు మాత్రమే. ఈ 8 మ్యాచ్ ల్లోనే ఏకంగా 971 రన్స్ చేశాడు.

యశస్వీ కంటే ముందు బ్రాడ్ మన్ ఒక్కడే తన తొలి 8 మ్యాచ్ ల్లో 1210 రన్స్ చేసి ఈ లిస్ట్ లో టాప్ లో ఉన్నాడు. సచిన్, కోహ్లీలు కూడా ఈ జాబితాలో యశస్వీ కంటే వెనకే ఉండటం గమనార్హం. ఈ ఘనతతో పాటుగా కోహ్లీ సరసన కూడా చేరాడు. ఇంగ్లండ్ పై ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ(655) సరసన చేరాడు జైస్వాల్. అయితే 5వ టెస్ట్ లో ఈ రికార్డును బద్దలు కొట్టడంతో పాటుగా ఒక సిరీస్ లో 700కుపైగా స్కోర్ చేసిన బ్యాటర్ గా గవాస్కర్ తర్వాత రెండో ఇండియన్ గా నిలిచే ఘనతకెక్కనున్నాడు. మరి సచిన్, విరాట్ లకు కూడా సాధ్యం కాని ఘనతను సాధించిన జైస్వాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: రోహిత్ ఇప్పుడు కదా కెప్టెన్​గా నువ్వు గెలిచింది! హ్యాట్సాఫ్!