iDreamPost

రోహిత్ ఇప్పుడు కదా కెప్టెన్​గా నువ్వు గెలిచింది! హ్యాట్సాఫ్!

  • Published Feb 26, 2024 | 3:26 PMUpdated Feb 26, 2024 | 4:37 PM

రాంచీ టెస్టులో రోహిత్ సేన అద్భుతమైన విజయాన్ని అందుకుంది. గెలుపు ఆశలు అడుగంటిన మ్యాచ్​లో పట్టుదలతో ఆడి గ్రాండ్ విక్టరీ కొట్టింది.

రాంచీ టెస్టులో రోహిత్ సేన అద్భుతమైన విజయాన్ని అందుకుంది. గెలుపు ఆశలు అడుగంటిన మ్యాచ్​లో పట్టుదలతో ఆడి గ్రాండ్ విక్టరీ కొట్టింది.

  • Published Feb 26, 2024 | 3:26 PMUpdated Feb 26, 2024 | 4:37 PM
రోహిత్ ఇప్పుడు కదా కెప్టెన్​గా నువ్వు గెలిచింది! హ్యాట్సాఫ్!

విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి స్టార్ బ్యాటర్లు అందుబాటులో లేరు. ఇంటర్నేషనల్ లెవల్​లో మంచి ఎక్స్​పీరియెన్స్​ ఉన్న శ్రేయస్ అయ్యర్​ కూడా జట్టులో లేడు. జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లూ దూరమయ్యారు. సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, రజత్ పాటిదార్, ఆకాశ్ దీప్ రూపంలో నలుగురు డెబ్యూటెంట్స్ జట్టులో ఉన్నారు. యశస్వి జైస్వాల్, శుబ్​మన్ గిల్​కు టెస్టుల్లో అంతగా అనుభవం లేదు. ఎదురుగా ఉన్నది బజ్​బాల్​తో భయపెడుతున్న ఇంగ్లండ్. సిరీస్​లోని తొలి మ్యాచ్​లోనే పలకరించిన ఓటమి. దీంతో భారత జట్టు పనైపోయింది అంటూ విమర్శలు వినిపించాయి. రోహిత్ శర్మను టీమ్​లో నుంచి తీసేయండి, అతడు కెప్టెన్సీకి పనికి రాడనే కామెంట్స్ వచ్చాయి. అయితే కట్ చేస్తే.. సిరీస్​ను 3-1తో కైవసం చేసుకుంది టీమిండియా. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్​ను పట్టేసింది.

రాంచీ టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ టీమ్​ను చిత్తు చేసింది. ఈ విక్టరీతో సిరీస్​ను మరో మ్యాచ్ ఉండగానే సొంతం చేసుకుంది.  కోహ్లీ, రాహుల్ అండ లేకపోయినా.. బుమ్రా, షమి దూరమైనా టీమ్​లో ఉన్న యంగ్​స్టర్స్ అండతో బజ్​బాల్​ బెండు తీశాడు రోహిత్. జైస్వాల్, గిల్, జురెల్, ఆకాశ్ దీప్, సర్ఫరాజ్ లాంటి యువ క్రికెటర్ల నుంచి తనకు ఏం కావాలో అది రాబట్టాడు. టీమ్ అవసరాలకు తగ్గట్లు వారి రోల్స్​ను ఫిక్స్ చేశాడు. సిచ్యువేషన్​కు తగ్గట్లు ఎలా ఆడాలో గైడ్ చేసి రిజల్ట్ రాబట్టాడు. ఉప్పల్ టెస్టు ఓటమి తర్వాత టీమ్​ను హిట్​మ్యాన్ నడిపించిన తీరు.. వరుసగా మూడు మ్యాచుల్లో జట్టును గెలిపించిన విధానం, సిరీస్​ను అందించిన దానికి ఎంత మెచ్చుకున్నా తక్కువే. జైస్వాల్​తో కలసి ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతూ టీమ్​కు మంచి స్టార్ట్​లు అందించాడు రోహిత్. తాను బ్యాటర్​గా రాణిస్తూ యువకుల్లో స్ఫూర్తిని నింపాడు. పరుగులు చేయాలనే కసిని, తపనను పెంచాడు.

బెన్ స్టోక్స్ బౌలింగ్ ఛేంజెస్​తో ఎంత ఇబ్బంది పెట్టినా, కఠినమైన పిచ్​ మీద పరుగులు రావడం కష్టమైనా యంగ్​స్టర్స్​ అండతో రాంచీలో విజయాన్ని కట్టబెట్టాడు రోహిత్. జైస్వాల్ లాంటి వారిని ఓ ఎండ్​లో నిలబడి గైడ్ చేశాడు హిట్​మ్యాన్. డ్రెస్సింగ్ రూమ్ నుంచి అవసరమైనప్పుడల్లా సూచనలను పలు విధాలుగా బ్యాటర్ల దగ్గరకు చేరువయ్యేలా చేశాడు. హిట్టింగ్ వద్దని క్రీజులో నిలబడితే రన్స్ అవే వస్తాయని ఈ పిచ్​ మీద ఎలా ఆడాలో జైస్వాల్, గిల్, జురెల్​కు అర్థం అయ్యేలా వివరించాడు. ఇది వర్కౌట్ అయింది. వాళ్లు పేషెన్స్​తో ఆడి టీమ్​ను విజయ తీరాలకు చేర్చారు. ఈ సిరీస్ మొత్తం బౌలింగ్ ఛేంజెస్, డీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకోవడంలోనూ రోహిత్ మార్క్ కనిపించింది.

బజ్​బాల్ పేరుతో దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు రోహిత్ అటాకింగ్ మంత్రాన్ని ఫాలో అయ్యాడు. అశ్విన్, జడేజా, బుమ్రాతో వికెట్లను టార్గెట్ చేసుకొని బౌలింగ్ చేయించాడు. రన్స్ లీకైనా భయపడొద్దని షాట్లు కొట్టే క్రమంలో వాళ్లే ఔట్ అవుతారని నచ్చజెప్పాడు. ఇది బాగా వర్కౌట్ అయింది. ఇంగ్లీష్ బ్యాటర్లు మంచి స్టార్ట్స్ దొరికినా హిట్టింగ్​కు వెళ్లి వికెట్లు అప్పగించుకున్నారు. నాలుగో టెస్టులో బుమ్రా లేకపోయినా కొత్త పేసర్ ఆకాశ్ దీప్​పై నమ్మకం ఉంచి బరిలోకి దించాడు. అది ఫలించి ఇంగ్లండ్ టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్​కు క్యూ కట్టారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా ఈ సిరీస్ హిట్​మ్యాన్​కు ఓ మధుర జ్ఞాపకంగా మిగిలి పోతుందనే చెప్పాలి.

రోహిత్​ను అందరూ మెచ్చుకుంటున్నారు. టాప్ ప్లేయర్స్ లేకపోయినా, మొదటి టెస్టులో ఓటమితో సిరీస్​లో వెనుకపడినా, బజ్​బాల్​ భయపెట్టినా టీమ్​కు సిరీస్​ అందించావని.. నువ్వు సూపర్ రోహిత్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఇది అసలైన విజయమని.. కెప్టెన్​గా రోహిత్ ఇప్పుడు గెలిచాడని కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు లేకపోయినా, ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా జట్టును గెలిపించే సత్తా తనలో ఉందని అతడు ప్రూవ్ చేశాడని అంటున్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్య టీమ్​ను గెలిపించడం హిట్​మ్యాన్ ఒక్కడి వల్లే సాధ్యమని చెబుతున్నారు. మరి.. రోహిత్ కెప్టెన్సీపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నాలుగో టెస్టులో భారత్ విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి