iDreamPost

నలుగురి ప్రేమలో వరల్డ్ లవర్ – ట్రైలర్

నలుగురి ప్రేమలో వరల్డ్ లవర్ – ట్రైలర్

డియర్ కామ్రేడ్ తర్వాత సుమారు ఏడాదిన్నర గ్యాప్ తో వస్తున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఇందాక జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కొత్తగా ట్రై చేసినట్టు ఉన్నారు దర్శకుడు క్రాంతి మాధవ్. గౌతమ్(విజయ్ దేవరకొండ)జీవితంలోకి వచ్చిన నలుగురు అమ్మాయిలు నాలుగు విభిన్నమైన అనుభవాలను అతనికి ఇస్తారు.

పార్టనర్ పేరుతో రాశి ఖన్నా, భార్య పేరుతో ఐశ్వర్య రాజేష్, ఫాంటసీ పేరుతో క్యాధరిన్ త్రేస్సా, గర్ల్ ఫ్రెండ్ పేరుతో ఇసాబెల్లె ఇలా రకరకాల కోణాల్లో ప్రేమ అనుభూతిని ఆస్వాదిస్తాడు గౌతమ్. కాని ఎక్కువగా ముడిపడిన అమ్మాయి మాత్రం పార్ట్ నరే. ఈ ప్రయాణంలో గౌతమ్ ఒక్కోసారి ఒక్కోలా మారిపోయి అన్నిరకాల భావోద్వేగాలకు లోనవుతాడు. ఆఖరికి తన వ్యక్తిగత జీవితం చాలా సంఘర్షణకు లోనవుతుంది. అసలు వరల్డ్ ఫేమస్ లవర్ మారాలనుకున్న గౌతం ఉద్దేశం ఏంటి అనేది పూర్తిగా రివీల్ చేయకుండా ట్రైలర్ ని తెలివిగా కట్ చేశారు

ట్రైలర్ మొత్తం విజయ్ దేవరకొండ షోలా సాగిపోయింది. అధిక ప్రాధాన్యం రాశి ఖన్నా పాత్రకు ఇచ్చినట్టు కనిపిస్తున్నా వేర్వేరు ట్రాక్స్ లో ఉన్న హీరొయిన్స్ ను సైతం కొత్త షేడ్స్ లో చూపించారు. గోపి సుందర్ సంగీతం సినిమా మూడ్ కు తగ్గట్టు ఎమోషనల్ గా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా రిచ్ గా ఉంది. నిర్మాత కెఎస్ రామారావు గారు రాజీ పడకుండా బాగానే ఖర్చుపెట్టినట్టున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ నుంచి అభిమానులు ఏదైతే ఆశిస్తున్నారో అది వరల్డ్ ఫేమస్ లవర్ ద్వారా అందించే ప్రయత్నం అయితే గట్టిగానే జరిగింది. మరి అంచనాలు నిలబడేలా సినిమా ఎలా ఉంటుందో ఈ నెల 14న తేలిపోతుంది.

Watch Trailer Here @ bit.ly/3bfik23

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి