క్రికెట్ కోసం తానెంత కష్టపడతాడో మరోసారి చెప్పాడు విరాట్ కోహ్లీ. తన డ్రీమ్ ఏంటో కూడా అతడు రివీల్ చేశాడు. రిజల్ట్స్ ఊరికే రావని.. దాని కోసం ఎంతో కష్టపడాలన్నాడు కింగ్.
క్రికెట్ కోసం తానెంత కష్టపడతాడో మరోసారి చెప్పాడు విరాట్ కోహ్లీ. తన డ్రీమ్ ఏంటో కూడా అతడు రివీల్ చేశాడు. రిజల్ట్స్ ఊరికే రావని.. దాని కోసం ఎంతో కష్టపడాలన్నాడు కింగ్.
వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా బ్రేకుల్లేని బుల్డోజర్లా దూసుకుపోతోంది. రోహిత్ సేనను ఆపడం ఎవరి తరం కావడం లేదు. వరుసగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను చిత్తు చేసిన భారత టీమ్ ఫేవరెట్స్ అయిన న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లనూ మట్టికరిపించింది. మన జట్టు ప్రస్తుత ఫామ్, ఆడుతున్న తీరు చూస్తుంటే ఈ వరల్డ్ కప్ మనదేనని అనిపిస్తోంది. ఈసారి భారత్ కప్పు గెలుస్తుందని ఫ్యాన్స్ కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ, బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన, విరాట్ కోహ్లీ సహా మిగిలిన బ్యాటర్ల సూపర్బ్ బ్యాటింగ్‌ను చూసి అభిమానులు ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచుకుంటున్నారు.
ఈ వరల్డ్ కప్‌లో అదరగొడుతున్న భారత బ్యాటర్లలో ముఖ్యంగా కింగ్ విరాట్ కోహ్లీ గురించే చెప్పుకోవాలి. వరుసగా విన్నింగ్ నాక్స్ ఆడుతూ టీమ్ గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నాడీ సీనియర్ బ్యాటర్. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన విరాట్.. లంకతో గేమ్‌లో చెలరేగి ఆడాలని భావిస్తున్నాడు. సెమీఫైనల్స్‌కు ముందు ఆడే మూడు మ్యాచుల్లో ఫామ్‌ను అందిపుచ్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అందుకు తగ్గట్లే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇక, నవంబర్ 5వ తేదీన విరాట్ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. అతడ్ని అభిమానించే కోట్లాది మంది ఫ్యాన్స్‌కు ఆ రోజు నిజమైన పండుగగా చెప్పాలి.
కోహ్లీ బర్త్ డే నాడు సౌతాఫ్రికాతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తలపడనుంది టీమిండియా. దీంతో ఆ మ్యాచ్‌లో విరాట్ సెంచరీ కొట్టాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. ఆ మ్యాచ్‌లో 49వ సెంచరీ కొట్టాలని.. ఈ వరల్డ్ కప్‌లో 50వ వన్డే సెంచరీల ఫీట్‌ను కూడా అతడు అందుకోవాలని కోరుకుంటున్నారు. లంకతో మ్యాచ్‌తో పాటు తన బర్త్ డే రానున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇన్ని రన్స్ చేస్తానని, ఇన్ని సెంచరీలు కొడతానని తానెప్పుడూ అనుకోలేదన్నాడు కోహ్లీ.
‘నా డ్రీమ్ ఎప్పుడూ భారత టీమ్ గెలవాలనేదే. అందుకోసం 100 పర్సెంట్ ఎఫర్ట్ పెడతా. జట్టు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా అందులో నుంచి బయటకు తీసి గెలిపించేందుకు ప్రయత్నిస్తా. దీని కోసం ఎంత కష్టపడేందుకైనా రెడీ. గేమ్ మీద నా ఫోకస్ ఉండేందుకు నిరంతరం క్రమశిక్షణతో ఉంటూ చాలా శ్రమిస్తున్నా. అలా చేస్తే రిజల్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. నా కష్టానికి తగ్గ ఫలితాలు అందుకున్నా. నా కెరీర్ నుంచి ఏమైనా నేర్చుకోవాలంటే ఇదే’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. మరి.. కోహ్లీ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: పాక్ టీమ్‌పై రమీజ్ రాజా సెటైర్స్.. తనకు నవ్వొస్తోందంటూ..!
Virat Kohli said “I work hard, always maintained a lot of discipline and keep my focus towards the game – then the game itself gave me the results – the learning of my career is that the game recognises the efforts”. pic.twitter.com/YNfNMNPnqy
— Johns. (@CricCrazyJohns) October 31, 2023