iDreamPost

పాక్​ టీమ్​పై రమీజ్ రాజా సెటైర్స్.. తనకు నవ్వొస్తోందంటూ..!

  • Author singhj Published - 05:34 PM, Tue - 31 October 23

పాకిస్థాన్ క్రికెట్ టీమ్​పై ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా సెటైర్స్ వేశాడు. తనకు నవ్వొస్తోందని.. నవ్వేందుకు పర్మిషన్ ఉందా అంటూ సొంత జట్టుపై జోక్స్ వేశాడు.

పాకిస్థాన్ క్రికెట్ టీమ్​పై ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా సెటైర్స్ వేశాడు. తనకు నవ్వొస్తోందని.. నవ్వేందుకు పర్మిషన్ ఉందా అంటూ సొంత జట్టుపై జోక్స్ వేశాడు.

  • Author singhj Published - 05:34 PM, Tue - 31 October 23
పాక్​ టీమ్​పై రమీజ్ రాజా సెటైర్స్.. తనకు నవ్వొస్తోందంటూ..!

ఓడలు బండ్లు అవ్వడం.. బండ్లు ఓడలు అవ్వడం అనే సామెత వినే ఉంటారు. క్రికెట్​లో కొన్ని జట్లకు ఈ సామెత వర్తిస్తుందనే చెప్పాలి. 1970 నుంచి 1980వ దశకం వరకు క్రికెట్​ను ఏలిన కరీబియన్ టీమ్ ఆ తర్వాత క్రమంగా ప్రాభవం కోల్పోతూ వచ్చింది. ఇప్పుడు వెస్టిండీస్ టీమ్ జాడే కనిపించడం లేదు. వన్డే వరల్డ్ కప్-2023కి క్వాలిఫై అవ్వడంలోనూ ఆ జట్టు ఫెయిలైంది. సీనియర్ క్రికెటర్లు టీమ్​లో ఉండగానే కుర్రాళ్లను తయారు చేసుకోవడం, డొమెస్టిక్ లెవల్ నుంచి ప్లేయర్ల సెలక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్​కు తగ్గట్లు కోచింగ్​తో పాటు క్రికెట్ వ్యవస్థను రూపొందించుకోవడం చాలా కీలకం.

క్రికెట్ బోర్డులు ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ఎవరి మీద డిపెండ్ అవ్వని సిస్టమ్​ను సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయకపోతే వెస్టిండీస్​లాగే మిగతా బడా టీమ్స్ కూడా కుదేలవ్వక తప్పని పరిస్థితి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే వెస్టిండీస్​లాగే శ్రీలంక తయారైనట్లు కనిపిస్తోంది. ఆ టీమ్​లో సీనియర్లు లేరు, మ్యాచ్ విన్నర్లు కనిపించడం లేదు. జట్టులోని యువకులు సమష్టిగా ఆడితేనే విజయాలు దక్కుతున్నాయి. ఛాంపియన్ టీమ్ అయిన లంక వరల్డ్ కప్స్​లో ఎంతో డేంజరస్​గా ఆడుతుంది. అలాంటి ఆ టీమ్ ఈ వరల్డ్ కప్​లో దారుణంగా పెర్ఫార్మ్ చేస్తోంది. అదే బాటలో ప్రయాణిస్తున్నాయి ఇంగ్లండ్, దాయాది పాకిస్థాన్. ఇంగ్లీష్ టీమ్​ నిండా స్టార్ ప్లేయర్లు ఉన్నా ఫెయిల్ అవ్వడంతో వరల్డ్ కప్​ రేసులో వెనుకబడిపోయింది. కానీ పాక్ పరిస్థితి వేరు.

పాకిస్థాన్​లో క్రికెట్​ వ్యవస్థ సరిగ్గా లేదు. కోచ్​లుగా ఫారెనర్లను నమ్ముకుంటున్నారు. ఆ కోచ్​లు కూడా ఆన్​లైన్​లో ప్లేయర్లకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పాక్ టీమ్​లో అంతర్గత విభేదాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటన్నింటికి తోడు ప్లేయర్లు కూడా సరిగ్గా రాణించకపోవడంతో వరల్డ్ కప్ రేసులో పాక్ వెనుకంజలో ఉంది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో ఓడి డేంజర్ జోన్​లో ఉంది. దీంతో బాబర్ సేనపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా కూడా సొంత జట్టుపై జోకులు వేశాడు. 1992లో ఇమ్రాన్​ ఖాన్ నేతృత్వంలోని పాక్ టీమ్ వరల్డ్ కప్ గెలుచుకుంది.

1992 వరల్డ్ కప్​లో తొలుత ఓటములు ఎదురైనా ఇమ్రాన్​ ఖాన్ పాక్​కు కప్పు అందజేశాడు. ఈ విషయాన్ని గుర్తుచేసిన కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అదే మ్యాజిక్​ను పాక్ కోచ్ మికీ ఆర్థర్ రిపీట్ చేస్తారా అని ప్రశ్నించారు. దీనికి పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా స్పందిస్తూ.. ఇదో జోక్ అని.. దీనికి తాను నవ్వొచ్చా అని అడిగాడు. నవ్వేందుకు పర్మిషన్ ఉందా అని పాక్ టీమ్​ను ఉద్దేశించి సెటైర్ వేశాడు. దీంతో పాక్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సొంత దేశ క్రికెటర్ అయ్యుండి టీమ్​ కోచ్​ను ఉద్దేశించి ఇలా అనడం కరెక్ట్ కాదని సీరియస్ అవుతున్నారు. మరికొందరేమో కోచ్​గా ఆర్థర్ సాధించిందేమీ లేదని.. అతడిపై జోక్స్ వేయడంలో తప్పే లేదని అంటున్నారు. మరి.. పాక్ పరువు తీసిన రమీజ్ రాజాపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కోహ్లీని డామినేట్ చేస్తున్న రోహిత్! ఇన్నాళ్లకు సాధ్యం అయ్యిందా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి