iDreamPost
android-app
ios-app

సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ.. అందుకే ఛేజ్ మాస్టర్ అనేది!

  • Author singhj Published - 08:34 AM, Mon - 9 October 23
  • Author singhj Published - 08:34 AM, Mon - 9 October 23
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ.. అందుకే ఛేజ్ మాస్టర్ అనేది!

టార్గెట్ 200. చూడ్డానికి ఇది చిన్నగానే కనిపించినా.. బౌలర్లకు మద్దతు లభిస్తున్న చెపాక్ పిచ్​పై ఆస్ట్రేలియా బ్యాటర్ల కష్టాలు చూశాక ఛేజింగ్ అంత ఈజీ కాదని అర్థమైంది. కానీ సూపర్ స్టార్లతో నిండిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్​కు, అందులోనూ అలవాటైన గ్రౌండ్​లో ఛేదన మరీ కష్టం కాదని అంతా అనుకున్నారు. అయితే 12 బంతుల్లోనే మొదటి 3 వికెట్లు పటడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. ఒక టైమ్​లో 2/3తో నిలిచిన భారత్ ముందు 200 కూడా కొండంత లక్ష్యంగా మారింది. ఈ తరుణంలో ఛేజింగ్ కింగ్​గా పేరున్న విరాట్ కోహ్లీ మళ్లీ తనలోని యోధుడ్ని బయటికి తీశాడు. రీఎంట్రీలో అదరగొడుతున్న కేఎల్ రాహుల్​ కూడా అతడికి తోడయ్యాడు.

ఆసీస్ పేసర్లు బౌన్సర్లతో భయపెడుతున్నా, గుడ్ లెంగ్త్ బంతులతో కవ్విస్తున్నా విరాట్, రాహుల్ సంయమనం చూపించారు. క్రీజులో కుదురుకున్నాక ఒక్కో రన్ చేస్తూ స్ట్రైక్ రొటేట్ చేశారు. ఆ తర్వాత బౌండరీలతో చెలరేగారు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్​లో విక్టరీతో భారత్ తన ప్రపంచ కప్ వేటను ఘనంగా మొదలుపెట్టింది. ఈ మ్యాచ్​లో టర్నింగ్ పాయింట్ అంటే రాహుల్-కోహ్లీ పార్ట్​నర్​షిప్ అనే చెప్పాలి. రెండు రన్స్​కే మూడు వికెట్లు పడిన టైమ్​లో వీళ్లు క్రీజులోకి వచ్చారు. ఆ సమయంలో మరో వికెట్ పడుంటే మ్యాచ్ అయిపోయేది. హేజిల్​వుడ్ బౌలింగ్​లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్​ను ఆసీస్ కెప్టెన్ కమిన్స్ వదిలేశాడు. ఆ క్యాచ్ పట్టుంటే రిజల్ట్ ఏ విధంగా ఉండేదో మరి!

కంగారూ టీమ్​పై విజయంలో విరాట్ కోహ్లీ (85)తో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచిన కేఎల్ రాహుల్ (97 నాటౌట్) బ్యాటింగ్​ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. కోహ్లీతో పాటు రాహుల్ కూడా సెంచరీ చేసే ఛాన్స్​ను మిస్ చేసుకున్నాడు. ఇక, ఈ మ్యాచ్​తో కోహ్లీ ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో టీమిండియా తరఫున అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్​గా చరిత్ర సృష్టించాడు. ఆసీస్​తో మ్యాచ్​లో ఈ రికార్డును అందుకున్నాడు. కోహ్లీ 64 ఇన్నింగ్స్​ల్లో 2,730 రన్స్ చేయగా.. సచిన్ టెండూల్కర్ 58 ఇన్నింగ్స్​ల్లో 2,719 రన్స్, రోహిత్ శర్మ 64 ఇన్నింగ్స్​ల్లో 2,422 రన్స్ చేశారు. అలాగే సచిన్ పేరు మీద ఉన్న మరో రికార్డునూ విరాట్ బ్రేక్ చేశాడు. ఛేజింగ్​లో 124 ఇన్నింగ్స్​ల్లో సచిన్ 5,490 రన్స్ చేయగా.. కోహ్లీ కేవలం 92 ఇన్నింగ్స్​ల్లోనే 5,517 రన్స్ చేసి మాస్టర్ బ్లాస్టర్​ను అధిగమించాడు.

ఇదీ చదవండి: ఆసీస్​పై భారత్ విజయానికి 5 ప్రధాన కారణాలు!