iDreamPost

World Cup: స్టంపౌట్​ను రనౌట్​గా ఇచ్చారు.. ఇదేం అంపైరింగ్ సామి!

  • Author singhj Published - 06:16 PM, Fri - 3 November 23

క్రికెట్​లో అంపైర్ల తప్పుడు నిర్ణయాలు కామనే. తీవ్ర ఒత్తిడి మధ్య రాంగ్ డెసిజన్స్ తీసుకోవడం మామూలే. కానీ కొన్నిసార్లు మాత్రం కళ్ల ముందు అంతా క్లియర్​గా కనిపిస్తున్నా పొరపాటున తప్పుడు నిర్ణయాలు వెల్లడిస్తారు.

క్రికెట్​లో అంపైర్ల తప్పుడు నిర్ణయాలు కామనే. తీవ్ర ఒత్తిడి మధ్య రాంగ్ డెసిజన్స్ తీసుకోవడం మామూలే. కానీ కొన్నిసార్లు మాత్రం కళ్ల ముందు అంతా క్లియర్​గా కనిపిస్తున్నా పొరపాటున తప్పుడు నిర్ణయాలు వెల్లడిస్తారు.

  • Author singhj Published - 06:16 PM, Fri - 3 November 23
World Cup: స్టంపౌట్​ను రనౌట్​గా ఇచ్చారు.. ఇదేం అంపైరింగ్ సామి!

క్రికెట్​లో అంపైరింగ్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంపైర్ ఇచ్చే నిర్ణయాల మీదే మ్యాచ్ రిజల్ట్ ఆధారపడుతుంది. కాబట్టి అంపైరింగ్ ఎంత పర్ఫెక్ట్​గా ఉంటే అంత మెరుగైన ఫలితాలు వస్తాయి. తప్పుడు అంపైరింగ్ వల్ల ఎన్నో మ్యాచుల్లో రిజల్ట్స్ తారుమారైన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే అంపైరింగ్ మిస్టేక్స్​ను తగ్గించేందుకు డెసిజన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)ను కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తీసుకొచ్చింది. అయినప్పటికీ ఇంకా తప్పుడు నిర్ణయాలు వస్తుండటం గమనార్హం. ఇప్పుడు జరుగుతున్న ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్-2023లోనూ పలు మ్యాచుల్లో అంపైరింగ్ మిస్టేక్స్ జరగడం చర్చనీయాంశంగా మారింది.

వరల్డ్ కప్​లో ఎల్బీడబ్ల్యూల విషయంలో అంపైరింగ్ కాల్స్ ఒక్కో మ్యాచ్​లో ఒక్కోలా ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. తాజాగా ఆఫ్ఘానిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్స్​ మ్యాచ్​లో అంపైర్ ఇచ్చిన ఒక డెసిజన్ ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది. డచ్ టీమ్ ఇన్నింగ్స్​లో 18వ ఓవర్​లో మహ్మద్ నబీ వేసిన బాల్​ను స్వీప్ ఆడేందుకు ప్రయత్నించి బ్యాలెన్స్ తప్పడంతో బ్యాట్స్​మన్ ఎడ్వర్డ్స్ కిందపడ్డాడు. బాల్ ఎటు వెళ్లిందో తెలియని ఎడ్వర్డ్ రన్ కోసం కాస్త ముందుకు వచ్చి మళ్లీ వెనక్కి మళ్లాడు. కానీ బాల్​ను అందుకున్న కీపర్ వికెట్లను గీరాటేశాడు.

ఆఫ్ఘాన్ కీపర్ ఇక్రమ్ అలిఖిల్ బాల్​తో స్టంప్స్​ను పడేయడంతో ఎడ్వర్డ్ వెనుదిరిగాడు. అయితే రన్ కోసం బ్యాటర్ పిచ్ మధ్యలోకి కూడా వెళ్లలేదు. అయినా అంపైర్ దీన్ని రనౌట్​గా ప్రకటించాడు. ఇది స్టంపౌట్ అయినప్పటికీ రనౌట్​గా ఇవ్వడంతో నబీ ఖాతాలోకి వెళ్లాల్సిన వికెట్ కాస్తా మిస్సయింది. ఈ స్టంపౌట్​పై నెట్టింట జోరుగా డిస్కషన్ జరుగుతోంది. స్టంపౌట్​ను రనౌట్​గా ఇవ్వడం ఏంటి సామి? వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ఇలాగేనా అంపైరింగ్ ఉండేదంటూ నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. మరి.. స్టంపౌట్ కాకుండా రనౌట్ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంతో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌ మనదేగా? అనే ప్రశ్నకు రోహిత్‌ సమాధానం చూడండి! గూస్‌బమ్స్‌ అంతే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి