టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిగతా ప్లేయర్లతో పోలిస్తే హిట్‌మ్యాన్ చాలా స్పెషల్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిగతా ప్లేయర్లతో పోలిస్తే హిట్‌మ్యాన్ చాలా స్పెషల్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు.
వరల్డ్ కప్-2023లో ఆడిన ఆరు వన్డేల్లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు భారత్. వరుసగా డబుల్ హ్యాట్రిక్ కొట్టి సెమీస్‌కు అత్యంత చేరువగా వచ్చింది టీమిండియా. సెమీఫైనల్ బెర్త్‌ను అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో గురువారం శ్రీలంకతో తలపడేందుకు రోహిత్ సేన రెడీ అయింది. ఈ మ్యాచ్‌లో ఓటమి భారత్‌కు కాదు గానీ లంకకు చాలా కీలకం. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఆ టీమ్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. ఒకవేళ టీమిండియా చేతుల్లో ఓడిపోతే మాత్రం మెగా టోర్నీ సెమీఫైనల్ రేసు నుంచి శ్రీలంక దాదాపుగా నిష్క్రమించినట్లే అవుతుంది. అందుకే ఈ మ్యాచ్‌ను ఆ టీమ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
ఒకవైపు లంక ఎలాగైనా నెగ్గాలని భావిస్తుంటే.. మరోవైపు భారత్ కూడా తమ విజయాల పరంపరను కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ బెర్త్ అధికారికంగా సొంతం చేసుకోవచ్చు. కాబట్టి మ్యాచ్‌ను ఈజీగా తీసుకోవద్దని అనుకుంటోంది. బౌలర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రన్స్ తీయలేక, వికెట్లను కాపాడుకోలేక ప్రత్యర్థి బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో టీమిండియా బౌలర్లను ఎదుర్కోవడం ఎవ్వరి వల్ల కావడం లేదు. బౌలింగ్ యూనిట్‌తో పాటు భారత బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో స్ట్రాంగ్‌గా ఉంది. శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌లను మినహాయిస్తే మిగతా బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వీళ్లిద్దరూ రిథమ్‌ను అందుకుంటే రోహిత్ సేను జోరును ఎవ్వరూ ఆపలేరు.
లంకతో మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్ రేసులోకి దూసుకెళ్తాలని భారత టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ అనుకుంటున్నాడు. అప్పుడే సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ మ్యాచ్‌లో బుమ్రా, కోహ్లీ లాంటి కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మపై భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హిట్‌మ్యాన్ మిగతావాళ్లలా కాదు.. చాలా స్పెషల్ అని మెచ్చుకున్నాడు. రికార్డులు సాధించాలనే స్వార్థం అతడికి లేదని ఇన్‌డైరెక్ట్‌గా అన్నాడు గవాస్కర్. ‘ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ ఎంతో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వికెట్లు త్వరగా పడిన టైమ్‌లో కేఎల్ రాహుల్‌తో కలసి అతడు ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. సెంచరీ కోసం ఆలోచించి స్లోగా బ్యాటింగ్ చేయలేదు. తన న్యాచురల్ గేమ్‌ను ఆడుకుంటూ వెళ్లాడు’ అని గవాస్కర్ మెచ్చుకున్నాడు. మరి.. రోహిత్‌పై గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రోహిత్ శర్మ టీమిండియాకు దూరంగా ఉండాలి: ఇంగ్లండ్ క్రికెటర్
Sunil Gavaskar said, “Rohit Sharma batted exceptionally well against England. After an early fall of wickets, he steadied the ship of Indian batting with KL Rahul. He didn’t slow down thinking his century was near, he kept playing his game naturally”. (Star). pic.twitter.com/4heSbYyRRI
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2023