iDreamPost

రేపే సెమీస్..! గంగూలీ ఆదర్శంగా బరిలోకి కోహ్లీ, రోహిత్!

  • Published Nov 14, 2023 | 4:09 PMUpdated Nov 14, 2023 | 4:26 PM

ఈ వరల్డ్‌ కప్‌ లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించినా.. సెమీస్‌లో మళ్లీ అదే జట్టు ఎదురొస్తే.. ఇండియన్‌ క్రికెట్‌ అభిమానుల్లో ఒకింత ఆందోళన. ఎందుకంటే నాకౌట్‌ మ్యాచ్‌ అంటేనే అంత. లీగ్‌ మ్యాచ్‌లు వేరే నాకౌట్‌ వేరు. ఒత్తిడిని జయించినోడే గెలుస్తాడు. అంత ఒత్తిడి ఉండే నాకౌట్స్‌లో కొందరు ఆటగాళ్లు అద్భుతంగా ఆడతారు. అసలు నాకౌట్‌ మ్యాచ్‌లకే ఒక కింగ్‌ ఉన్నాడు. అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వరల్డ్‌ కప్‌ లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించినా.. సెమీస్‌లో మళ్లీ అదే జట్టు ఎదురొస్తే.. ఇండియన్‌ క్రికెట్‌ అభిమానుల్లో ఒకింత ఆందోళన. ఎందుకంటే నాకౌట్‌ మ్యాచ్‌ అంటేనే అంత. లీగ్‌ మ్యాచ్‌లు వేరే నాకౌట్‌ వేరు. ఒత్తిడిని జయించినోడే గెలుస్తాడు. అంత ఒత్తిడి ఉండే నాకౌట్స్‌లో కొందరు ఆటగాళ్లు అద్భుతంగా ఆడతారు. అసలు నాకౌట్‌ మ్యాచ్‌లకే ఒక కింగ్‌ ఉన్నాడు. అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Nov 14, 2023 | 4:09 PMUpdated Nov 14, 2023 | 4:26 PM
రేపే సెమీస్..! గంగూలీ ఆదర్శంగా బరిలోకి కోహ్లీ, రోహిత్!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 చివరి దశకు చేరుకుంది. ఇంకో మూడు మ్యాచ్‌ జరిగితే.. విశ్వవిజేత ఎవరో తేలిపోతుంది. భారత్‌-న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య రెండు సెమీస్‌ మ్యాచ్‌లు.. 19న ఫైనల్‌తో మెగా టోర్నీ ముగుస్తుంది. బుధవారం ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియం వేదిక న్యూజిలాండ్‌తో టీమిండియా తొలి సెమీ ఫైనల్‌లో తలపడనుంది. అలాగే 16న కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ప్రొటీస్‌-ఆసీస్‌ జట్లు రెండో సెమీస్‌ ఆడతాయి. ఈ రెండు నాకౌట్‌ మ్యాచ్‌లు కచ్చితంగా క్రికెట్‌ అభిమానులకు ఫుల్‌ వినోదాన్ని అదించడం మాత్రం ఖాయం. నాలుగు మేటి జట్ల మధ్య నాకౌట్‌ మ్యాచ్‌లు జరగనుండటంతో హైటెన్షన్‌ క్రికెట్‌కు ఢోకా ఉండకపోవచ్చు. అయితే.. ఇలాంటి నాకౌట్‌ మ్యాచ్‌ల్లో తీవ్ర ఒత్తడి ఉంటుందన్న విషయం తెలిసిందే.

మరి అలాంటి ఒత్తిడిని తట్టుకుని ఆడి, అద్భుత ప్రదర్శన చేసే ఆటగాళ్లు కొంతమందే ఉంటారు. టోర్నీ మొత్తం ఒక ఎత్తు.. నాకౌట్‌ మ్యాచ్‌లు ఒక ఎత్తు. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడినా.. నాకౌట్‌లో విఫలం అవుతుండే ఆటగాళ్లను చూస్తూ ఉంటాం. అందుకే నాకౌట్‌లో మంచి బాగా ఆడే ఆటగాళ్లను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ముఖ్యంగా వరల్డ్‌ కప్స్‌ టోర్నీల్లో జరిగే నాకౌట్‌ మ్యాచ్‌ల్లో అయితే నరాలు తెగిపోయే ఉత్కంఠత, అలాగే భరించలేనంత ఒత్తిడి ఉంటుంది. మరి వీటన్నింటిని అధిగమించి.. నాకౌట్‌ మ్యాచ్‌లకు హీరోలుగా నిలిచిన కొంతమంది ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లు ఎవరు? నాకౌట్స్‌లో ఎలాంటి రికార్డులు నమోదు చేశారో తెలుసుకుందాం..

ఇప్పటి వరకు జరిగిన ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌లను పరిశీలిస్తే.. అత్యధిక రన్స్‌ చేసిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. 731 పరుగులు చేశాడు. తర్వాతి స్థానంలో సచిన్‌ టెండూల్కర్‌ 682 రన్స్‌తో ఉన్నాడు. మూడో ప్లేస్‌లో శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార్‌ సంగక్కర 597 రన్స్‌తో ఉన్నాడు. ఇక నాలుగో ప్లేస్‌లో టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ 580 రన్స్‌తో నిలిచాడు. ఐదో ప్లేస్‌లో లంక మాజీ కెప్టెన్‌ మహేల జయవర్దనే 571, ఆరో ప్లేస్‌లో టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ 563 రన్స్‌తో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే సెమీస్‌లో ఓ 35 పరుగులు చేస్తే.. జయవర్దనే, గంగూలీ, సంగక్కరను దాటేసి మూడో స్థానం చేరుకుంటాడు. ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫామ్‌ను బట్టి అది పెద్ద కష్టం కాదు. అయితే.. ఇప్పుడు చెప్పుకున్న ఈ ఆరు ఆటగాళ్ల జాబితాలో రన్స్‌ పరంగా పాంటింగ్‌ టాప్‌లో ఉన్నా.. యావరేజ్‌ పరంగా మాత్రం గంగూలీ నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాడు.

దాదా ఏకంగా 82.85 సగటుతో 580 రన్స్‌ చేశాడు. ఈ లిస్ట్‌లో దాదా దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. పాంటింగ్‌ 45.68, సచిన్‌ 48.71, సంగక్కర 37.31, జయవర్దనే 35.68, కోహ్లీ 56.30 యావరేజ్‌ మాత్రమే కలిగి ఉన్నారు. ఇక నాకౌట్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన లిస్ట్ చూసుకుంటే.. విరాట్‌ కోహ్లీ, సచిన్‌ టాస్‌ ప్లేస్‌లో ఉన్నారు. ఇద్దరు ఆరేసి హాఫ్‌ సెంచరీలో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాక్వెస్‌ కల్లీస్‌, కుమార్‌ సంగక్కర, సౌరవ్‌ గంగూలీ ఐదేసి హాఫ్‌ సెంచరీలు బాది ఉన్నారు. ఈ లెక్కల ప్రమాణికంగా.. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో యావరేజ్‌ పరంగా గంగూలీ, రన్స్‌ పరంగా పాంటింగ్‌, హాఫ్‌ సెంచరీల పరంగా కోహ్లీ, సచిన్‌లను హీరోలుగా చూడొచ్చు. నాకౌట్స్‌ అంటూ చాలు వీరు నలుగురు పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు. అయితే.. మూడు విభాగాల్లోనూ సౌరవ్‌ గంగూలీ చాలా మెరుగ్గ ఉండట విశేషం. అందుకే.. నాకౌట్‌ కింగ్‌గా దాదాను పేర్కొనవచ్చు. అయితే.. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగే సెమీస్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ సైతం గంగూలీని ఆదర్శంగా తీసుకుని.. సెమీస్‌లో అదరగొట్టాలని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి